మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ (79) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి మలయాళ చిత్రాల్లో ఈమె పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇలా ఈమె మృతి చెందడంపై స్టార్ హీరోహీరోయిన్లతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)
'తల్లి పాత్రలతో మలయాళ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం. ఆమె జీవితం సినిమాకే పరిమితం కాదు. థియేటర్, టెలివిజన్ రంగాలకు కూడా విస్తరించింది' అని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
ఇకపోతే పొన్నమ్మ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కలమస్సేరి మున్సిపల్ టౌన్ హాల్‌లో ప్రజల సందర్శనార్ధం ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. గాయనిగా పొన్నమ్మ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత నాటకరంగంలోకి ప్రవేశించి, అనంతరం నటిగా మారారు. అలా దాదాపు 1000 సినిమాల్లో నటించారు. ఈమె చేసిన తల్లి పాత్రలతో అందరికీ దగ్గరైపోయారు. అలానే విలన్ తరహా పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.ప్రతికూల పాత్రలతో సహా విభిన్న పాత్రలను పోషించింది. మేఘతీర్థం చిత్రాన్ని కూడా నిర్మించారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment