పేరున్న యాక్టర్స్ లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేకపోతాయి. అలాంటి వాటిలో కొన్నాళ్ల క్రితం తెలుగులో రిలీజైన 'పేకమేడలు' ఒకటి. 'బాహుబలి' ఫేమ్ నటుడు రాకేశ్ వర్రే నిర్మించిన ఈ మూవీలో తమిళ నటుడు వినోద్ కిషన్ హీరోగా నటించాడు. ఇప్పటికే ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది.
ఏ ఓటీటీలో?
జూలై 19న 'పేకమేడలు' సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే అదే రోజు మరికొన్ని మూవీస్ రిలీజ్ కావడంతో దీనికి బిగ్ స్క్రీన్‌పై సరైన ఆదరణ దక్కలేదు. లో బడ్జెట్ మూవీ కావడంతో జనాలకు సరిగా రీచ్ కాలేకపోయింది. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయని చూసిన చాలామంది మెచ్చుకున్నాడు. అలానే రిలీజైన నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)
కథేంటి?
లక్ష‍్మణ్ (వినోద్ కిషన్) ఇంజినీరింగ్ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. డీల్ సెట్ లక్షల్లో డబ్బు వస్తుందని ఆశపడుతుంటాడు. కానీ ఒక్క డీల్ కూడా సక్సెస్ కాదు. కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా భార్య సంపాదనపై జల్సాలు చేస్తుంటాడు. ఆమె పేరు చెప్పి అప్పులు చేస్తుంటాడు. భర్త ఎప్పటికైనా బాగుపడతాడని భార్య అప్పులన్నీ తీరుస్తుంటుంది.
కట్ చేస్తే భర్తని వదిలేసి అమెరికా నుంచి ఇండియా వచ్చిన శ్వేత (రితికా శ్రీనివాస్) అనుకోకుండా లక్ష‍్మణ్ జీవితంలోకి వస్తుంది. డబ్బున్న యువకుడినని శ్వేతని లక్ష‍్మణ్ నమ్మిస్తాడు. ఆమెకు దగ్గరవుతాడు. భార్య, పిల్లల్ని దూరం పెడతాడు. చివరకు ఏమైంది? లక్ష‍్మణ్ ఏం తెలుసుకున్నాడనేదే మెయిన్ పాయింట్.
(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)
Comments
Please login to add a commentAdd a comment