
తమిళ హీరో విక్రమ్ అనగానే ప్రయోగాత్మక సినిమాలే గుర్తొస్తాయి. గత కొన్నాళ్లుగా సరైన హిట్ పడక చాలా వెనకబడిపోయిన ఈ హీరోని ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో కమర్షియల్ కథతో మూవీ చేశాడు. అదే 'వీర ధీర శూర'. మార్చి 27న తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))
టీజర్ బట్టి చూస్తే.. హీరో కిరాణా కొట్టు నడుపుతూ ఉంటాడు. ఓ హీరోయిన్ తో ప్రేమలోనూ ఉంటాడు. కట్ చేస్తే సింపుగా కనిపించే హీరోకి భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇంతకీ అదేంటనేదే సినిమా కథలా అనిపిస్తుంది.
విక్రమ్ సరసన దుషారా విజయన్ నటించిది. ఎస్జే సూర్య, సూరజ్ వెంజుమోడు లాంటి స్టార్స్ నటించారు. ఎస్ఏ అరుణ్ కుమార్ దర్శకుడు. నేరుగా ఈ సినిమా పార్ట్-2 రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇది హిట్ అయితే 'కాంతార' టైపులో ప్రీక్వెల్ తీస్తారేమో?
(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment