మనమందరం ప్రేమికులమే! | abbayi-ammayi audio relesed | Sakshi
Sakshi News home page

మనమందరం ప్రేమికులమే!

Published Thu, Nov 19 2015 10:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

మనమందరం ప్రేమికులమే!

మనమందరం ప్రేమికులమే!

‘‘ఒక్కొక్కరికి ఒక్కో విషయంపై ప్రేమ ఉంటుంది. నాకు సంగీతంపై ప్రేమ ఉంటే కొందరికి డబ్బులపై ఉంటుంది. కాబట్టి మనమందరం ప్రేమికులమే. నేను మ్యూజిక్ చేసిన సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. పాటలు విని శ్రోతలు మాట్లాడాలి. ఈ ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా అన్నారు.

 నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మిస్తున్న ‘అబ్బాయితో అమ్మాయి’ పాటల ఆవిష్కరణ బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇళయరాజా పాటల సీడీనీ, నాగశౌర్య తల్లి ఉష, పల్లక్ లల్వాని తల్లి దీపికా లల్వాని  థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ - ‘‘నా కెరీర్ తొలిదశలోనే ఇళ యరాజాగారితో పనిచేయడం నా అదృష్టం.

 ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా కంటే ముందే నేను రమేశ్‌వర్మతో సినిమా చేయాలి. ఇప్పటికి కుదిరింది’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు నల్లమలుపు బుజ్జి, సాయి కొర్రపాటి, అవసరాల శ్రీనివాస్, లగడపాటి శ్రీధర్, బెల్లంకొండ సురేశ్, సి. కల్యాణ్, దాసరి కిరణ్, రావు రమేశ్, మల్టీడైమన్షన్ వాసు, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement