
మనోజ్ 'ఒక్కడు మిగిలాడు'
'స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి!' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అదరగొడుతున్నారు. ఆయన నటించిన చిత్రం 'ఒక్కడు మిగిలాడు' థియెట్రికల్ ట్రైలర్‌ను శనివారం ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న మనోజ్. 'భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏమని పిలిచుకునేవారు?. తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా?' అనే ఉద్విగ్నభరిత వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
ఈ చిత్రంలో మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్రలో ఎల్టీటీఈ ప్రభాకరన్‌గా మనోజ్ నటించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 'ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి. స్వేచ్చ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే' అనే మరో డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తుండగా, లక్ష్మీకాంత్, ఎస్‌ఎన్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి! Here comes #OkkaduMigiladuTrailer.A revolt for respect! pic.twitter.com/Y8znpJAwtK
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 19 August 2017