రౌండప్‌ చేశారు! | okkadu migiladu kannada remake | Sakshi
Sakshi News home page

రౌండప్‌ చేశారు!

Published Sun, Nov 26 2017 12:59 AM | Last Updated on Sun, Nov 26 2017 8:09 AM

okkadu migiladu kannada remake - Sakshi - Sakshi - Sakshi

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం... ఇలా భాష ఏదైనా, పాత్ర ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు సుహాసిని. కాదు.. జీవిస్తారంటే బాగుంటుంది. క్యారెక్టర్‌ నటిగా మారిన తర్వాత కూడా మంచి రోల్స్‌ చేస్తున్నారామె. ఈ నెలలో మంచు మనోజ్‌ హీరోగా రిలీజైన ‘ఒక్కడు మిగిలాడు’లో మంచి పాత్రలో కనిపించారు. ఇప్పుడు రెండు కన్నడ సినిమాల్లో నటించేందకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి తమిళ ‘పవర్‌ పాండి’కి రీమేక్‌.

తమిళ హీరో, నిర్మాత అయిన ధనుష్‌ ఈ చిత్రం ద్వారానే దర్శకునిగా మారిన విషయం తెలిసే ఉంటుంది. సినిమాకి మంచి ప్రశంసలు రావడం, యూనివర్సల్‌ కథాంశం కావడంతో బాగుంటుందని కన్నడంలో రీమేక్‌ చేయాలనుకున్నారట. నందకిషోర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్‌కిరణ్‌ చేసిన పాత్రను అంబరీష్‌ చేయనున్నారు. ధనుష్‌ చేసిన గెస్ట్‌ రోల్‌ను సుదీప్, ఓ కీలక పాత్రను సుహాసిని చేయనున్నారు.

ఈ చిత్రానికి ‘అంబి నింగె వయసాయితు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇది కాకుండా కన్నడ నటుడు అనంతనాగ్‌ నటించనున్న సినిమాలో ఆమె ఓ గెస్ట్‌ రోల్‌ చేయనున్నారని శాండిల్‌వుడ్‌ టాక్‌. అంటే ఒకటి గెస్ట్‌ రోల్‌ అయితే... రెండోవది ఇంపార్టెంట్‌ అన్నమాట. కన్నడంలో ఈ రెండు సినిమాలే కాదు.. తమిళంలో మూడు నాలుగు, మలయాళంలో ఒక సినిమా.. ఇలా సౌత్‌ని రౌండప్‌ చేస్తూ, సుహాసిని ఫుల్‌ బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement