![Manchu Manoj Next movie with CHandra Sekhar Yeleti - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/26/Manchu%20Manoj.jpg.webp?itok=NtlfEWir)
స్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ ఆ స్థాయికి తగ్గ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఒకటి రెండు సినిమాలు తప్ప కెరీర్ లో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టే హిట్ ఒక్కటి కూడా పడలేదు మనోజ్‌కు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనోజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు.
తనకు ప్రయాణం లాంటి డిఫరెంట్ సినిమాను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నా, ఇంత వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా సాధించలేదు. చివరగా మనమంతా సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా హిట్ సినిమా అని మాత్రం అనిపించలేకపోయాడు. మనోజ్ కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు ఏలేటి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment