manamantha
-
మంచు మనోజ్ మరో ప్రయాణం..!
స్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ ఆ స్థాయికి తగ్గ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఒకటి రెండు సినిమాలు తప్ప కెరీర్ లో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టే హిట్ ఒక్కటి కూడా పడలేదు మనోజ్‌కు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనోజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తనకు ప్రయాణం లాంటి డిఫరెంట్ సినిమాను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నా, ఇంత వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా సాధించలేదు. చివరగా మనమంతా సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా హిట్ సినిమా అని మాత్రం అనిపించలేకపోయాడు. మనోజ్ కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు ఏలేటి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
మనమంతాపై రాజమౌళి రివ్యూ
మంచి సినిమాలను తన స్టైల్లో ప్రమోట్ చేసే దర్శక ధీరుడు రాజమౌళి మనమంత సినిమాపై రివ్యూ రాశాడు. ప్రతీ సినిమా విషయంలో కేవలం కామెంట్స్‌కే పరిమితమయ్యే జక్కన్న.. మనమంతా సినిమాపై మాత్రం ఓ చిన్నపాటి రివ్యూనే రాశాడు. చిత్ర నటీనటులు, సాకేంతిక నిపుణులను అభినందించాడు. 'మనమంతా.. చంద్రశేఖర్ ఏలేటి, వారాహి చలన చిత్రం బ్యానర్ల కెరీర్లో టాప్ క్లాస్ సినిమాగా మిగిలిపోతుంది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నటీనటుల నుంచి అద్భుతమైన పర్ఫామెన్స్‌ను రాబ్టటాడు. మోహన్ లాల్ లాంటి మహానటుడి నుంచి నాలుగేళ్ల చిన్నారి వరకు అందరూ మనల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, చాలా కాలం పాటు మన మనసుల్లో.. ఆలోచనల్లో నిలిచిపోతారు. సినిమాలోని ప్రతీ అంశం సినీ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి టెక్స్ట్ బుక్ లాంటిది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరు మేమూ మనమంతా సినిమాకు పనిచేశాం అని గర్వంగా చెప్పుకుంటారు'. అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కేవలం ఈసినిమా చూడటం కోసం బాహుబలి షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. #Manamantha will remain a top class film in the career of chandu and vaaraahi chalana chithram.Chandu has a knack of extracting fantastic— rajamouli ss (@ssrajamouli) 5 August 2016Performances from his actors. From a seosoned actor like mohanlal garu to a 4 year old kid every one will make you smile laugh and cry and— rajamouli ss (@ssrajamouli) 5 August 2016Will remain in our hearts and thoughts for a very long time.The way the film began the way it was weaved and the way it ended is a text book— rajamouli ss (@ssrajamouli) 5 August 2016For every film student.Congratulations2 the entire unit. Everyone who worked in the film can proudly say he/she is a member of #Manamantha— rajamouli ss (@ssrajamouli) 5 August 2016 -
'మనమంతా' మూవీ రివ్యూ
టైటిల్ : మనమంతా జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనారావు, గొల్లపూడి మారుతీరావు... సంగీతం : మహేష్ శంకర్ దర్శకత్వం : చంద్రశేఖర్ ఏలేటి నిర్మాత : సాయి కొర్రపాటి ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం లాంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా మనమంతా. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడంతో పాటు, ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం కూడా సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను మనమంతా అందుకుందా...?తెలుగులో మోహన్ లాల్ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యింది..? మనమంతా చంద్రశేఖర్ ఏలేటికి కమర్షియల్ హిట్ ఇచ్చిందా..? కథ : సాయిరామ్ (మోహన్ లాల్), గాయత్రి(గౌతమి), అభిరామ్( విశ్వాంత్), మహిత(రైనారావు).. ఈ నలుగురి జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగే కథ మనమంతా.. సాయిరామ్ ఓ సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ పోషణకు తన జీతం సరిపోక అప్పులు చేస్తూ బండి లాగిస్తుంటాడు. అదే సమయంలో తన స్టోర్ మేనేజర్ రిటైర్ అవ్వటంతో ఆ మేనేజర్ పోస్ట్ తనకు వస్తుందని ఆశపడతాడు. కానీ విశ్వనాధ్ అనే మరో అసిస్టెంట్ మేనేజర్ వల్ల తనకు ఆ పోస్ట్ రాదేమో అనుమానంతో విశ్వనాధ్‌ను అడ్డు తప్పించడానికి ప్లాన్ చేస్తాడు.. కానీ ఆ ప్లాన్ మూలంగా తానే చిక్కుల్లో పడతాడు. గాయ్రతి ఓ మధ్యతరగతి గృహిణి, ఉన్నత చదువులు చదివినా.. అవన్ని పక్కన పెట్టేసి ఇంటి పనులుకే పరిమితమవుతుంది. మిడిల్ క్లాస్ మనుషులకు ఎదురయ్యే అవమానాలకు కన్నీళ్లు పెట్టడం తప్ప ఏం చేయలేని నిస్సహాయురాలు. అలాంటి గాయత్రికి తన చిన్నతనంలో తన వల్ల సాయం పొందిన ఓ పెద్దమనిషి సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. అప్పటి వరకు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియని గాయత్రి, కుటుంబం కోసం సింగపూర్ వెళ్లడానికి సిద్ధమవుతుంది. విశ్వాంత్ చదువు తప్ప మరో ఆలోచనలేని ఇంజనీరింగ్ స్టూడెంట్. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన ఐరా(అనీషా ఆంబ్రోస్) అనే అమ్మాయి వల్ల విశ్వాంత్ ఆలోచనలు మారిపోతాయి.. ఐరానే తన ప్రపంచం అనుకుంటాడు. కానీ ఐరా, విశ్వాంత్‌ను ఒక ఫ్రెండ్ గానే భావిస్తుంది. మహిత తన చుట్టూ ఉన్న వాళ్లందరిని ఆనందంగా చూడలనుకునే చిన్నపాప. గుడిసెలో ఉండే ఓ చిన్నబాబుతో స్నేహం చేసి.. ఆ అబ్బాయికి తను చదివే స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తుంది. కానీ ఆ అబ్బాయి తప్పిపోవటంతో తనే వెతికే బాధ్యతను తీసుకుంటుంది. ఇలా నాలుగు రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ నలుగురికి సంబంధం ఏంటి..? సాయిరామ్ మేనేజర్ పోస్ట్ కోసం కొని తెచ్చుకున్న సమస్య నుంచి బయట పడ్డాడా..? గాయత్రి కుటుంబాన్ని వదిలి సింగపూర్ వెళ్లిందా..? విశ్వాంత్.. ఐరా కాదన్న తరువాత ఏమైయ్యాడు..? మహిత తన ఫ్రెండ్‌ను కనుక్కోగలింగిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన తెలుగు సినిమా కోసం మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్‌ని ఒప్పించిన చంద్రశేఖర్ ఏలేటి అప్పుడే తొలి విజయం సాధించాడు. మధ్యతరగతి సమస్యలతో సతమతమయ్యే ఉద్యోగిగా మోహన్ లాల్ నటన అద్భుతమనే చెప్పాలి. తొలి సినిమాలోనే సొంతం గొంతుతో డబ్బింగ్ చెప్పిన మోహన్ లాల్, మొదట్లో కాస్త తడబడినట్టు అనిపించినా.. తరువాత బాగానే ఆకట్టుకున్నాడు. గాయత్రిగా గౌతమి నటన బాగుంది. మిడిల్ క్లాస్ మహిళగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె సీనియారిటీ సినిమాకు ప్లస్ అయ్యింది. విశ్వాంత్, రైనారావులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతిరావు, వెన్నెలకిశోర్, హర్షవర్ధన్, నాజర్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : తన కెరీర్లో ప్రతీ సినిమా ఓ ప్రయోగంగా నిలిచిపోయేలా చేసే చంద్రశేఖర్ ఏలేటి మనమంతా సినిమాతో మరోసారి స్టైల్‌ను కంటిన్యూ చేశాడు. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో మధ్యతరగతి జీవితాలను వారి సమస్యలను అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు. నాలుగు కథలు ఒకేసారి నడుస్తున్నా.. ఎక్కడ ఆడియన్స్ కన్య్ఫూజ్ కాకుండా సినిమాను ముందుకు నడిపించాడు. నటీనటుల ఎంపిక నుంచి ప్రతీ విషయంలోనూ చంద్రశేఖర్ ఏలేటి మార్క్ సినిమాలో స్పష్టంగా కనిపించింది. మహేష్ శంకర్ అందించిన పాటలు విజువల్‌గా చాలా బాగున్నాయి. నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫి, జివి చంద్రశేఖర్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి. ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రల నటన స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం ఓవరాల్‌గా మనమంతా అద్భుతమైన నటన, ఆసక్తికరమైన కథా కథనాలతో థ్రిల్ కు గురిచేసే ఫ్యామిలీ డ్రామా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
రేసు నుంచి తప్పుకున్న ఆది
మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది.. భారీ పోటీలో సినిమాను రిలీజ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. అందుకే ముందుగా ఆగస్టు 5న తన లేటెస్ట్ మూవీ చుట్టాలబ్బాయి రిలీజ్ ప్లాన్ చేసినా.. ఇప్పుడు రేసు నుంచి తప్పకున్నాడు. అదే రోజు మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో రిస్క్ ఎందుకన్న ఉద్దేశంతో తన సినిమాను వాయిదా వేశాడు. ఆగస్ట్ 5న రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి అంచనాలు ఉన్న సినిమా శ్రీరస్తు శుభమస్తు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అల్లు వారబ్బాయి శిరీష్.. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు చందశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలి సారిగా చేస్తున్న తెలుగు సినిమా కావటంతో ఈ సినిమాపై కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలతో పోటి పడటం కన్నా సేఫ్ టైంలో సినిమా రిలీజ్ చేసుకోవటం బెటర్ అని ఫీల్ అవుతున్నాడు ఆది. అందుకే చుట్టాలబ్బాయి సినిమాను ఆగస్ట్ 19న తీరిగ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. -
‘మనమంతా’ వర్కింగ్ స్లిల్స్
-
మోహన్ లాల్‌తో మరో నందమూరి హీరో
నందమూరి యంగ్ హీరో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఈ మళయాల సూపర్ స్టార్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో మరో నందమూరి హీరో నటిస్తున్నాడు. తొలిసారిగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తెలుగు సినిమా మనమంతా. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి తారకరత్న ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రాజా చెయ్యివేస్తే సినిమాలో విలన్ గా ఆకట్టుకున్న తారక రత్న, మనమంతా లో మాత్రం పాజిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. -
'మనమంతా'కు క్లీన్ యు సర్టిఫికేట్
విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనమంతా. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. నాలుగు విభిన్న వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు వాళ్ల కథల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ తో పాటు సీనియర్ హీరోయిన్ గౌతమి, కేరింత ఫేం విశ్వాంత్, బేబి రైనాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కు భిన్నంగా మూస మాస్ మసాలా అంశాలేవి లేకుండా తెరకెక్కిన ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ ను అందించారు. మోహన్ లాల్ హీరోగా నటించిన తొలి సినిమానే అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేయటం కోసం తెలుగు నేర్చుకొని మరి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. -
బాల్యం.. కౌమారం.. యవ్వనం...
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ రెండు దశాబ్దాల తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మనమంతా’. మోహన్‌లాల్, గౌతమి, విశ్వాంత్, రైనారావు ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు.వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి కొర్రపాటి మాట్లా డుతూ- ‘‘మానవ సంబంధాలు, ఎమోషన్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. బాల్యం, కౌమారం, యవ్వన దశల్లోని ప్రయాణం నేపథ్యంలో కథ సాగుతుంది. తెలుగుతో పాటు తమిళంలో ‘నమదు’, మలయాళంలో ‘విస్మయం’ పేరుతో ఒకే రోజు విడుదల చేస్తున్నాం. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు’’ అని తెలిపారు. అనీషా, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరాం, పరుచూరి వెంకటేశ్వరరావు, అయ్యప్ప శర్మ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: మహేష్ శంకర్. -
పక్కింటి మహిళ!
లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు మనకు ఇష్టమైనా... సహజంగా ఉండే పాత్రలే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. నడకలో, నడతలో, కట్టూ బొట్టులో అలాంటి పాత్రలతోనే మన చుట్టూ ఉన్న మనషులను పోల్చుకుంటాం. ఇలాంటి వాళ్లను ఎక్కడో చూశాం.. మన ఇంట్లోనో, పొరుగింట్లోనో, బంధువుల్లోనో... అని ఆలోచిస్తాం. సహజంగా చిత్రీకరించే మధ్యతరగతి పాత్రలు అంతగా దగ్గరవుతాయి. నిన్నటి తరం నాయిక గౌతమి ‘మనమంతా’ సినిమాలో ఇలాంటి పాత్రలోనే కనిపించనున్నారు. ఈ సినిమాలో గౌతమి చేసిన గాయత్రి అనే పాత్ర మధ్య తరగతి మహిళల జీవితాలను ప్రతిబింబించేలా ఉండబోతోంది. ఒక ప్రపంచంలో నాలుగు కథలు అనే కాన్సెప్ట్‌తో సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. -
ఈద్ ముబారక్ అంటున్న హీరో
మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్న మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం వేషధారణలో ఉన్న తన ఫొటోనే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ కంప్లీట్ యాక్టర్.. ఇద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ పండుగలోని దైవస్ఫూర్తి మీ జీవితాల్లో ఆనందం, శాంతి కలిగించాలని ఆకాంక్షించారు. మోహన్ లాల్ కీలక పాత్రలో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. గతంలో గాండీవం సినిమాలో ఓ పాటలో కనిపించిన మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో అలరించనున్నాడు. Eid Mubarak...May the divine spirit of Ramadan fill your life with happiness, peace and prosperity pic.twitter.com/RUBEwvB8SZ — Mohanlal (@Mohanlal) 6 July 2016 -
ఒకే ప్రపంచం..నాలుగు కథలు.. మనమంతా
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా మనమంతా. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిరుచి గల నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యింది. తొలి టీజర్లో పాత్రల పరిచయంతో పాటు సినిమాలో ఆ పాత్రలు ప్రవర్తించే తీరును కూడా చూపించాడు దర్శకుడు. ఒకే ప్రపంచం.. నాలుగు కథలు అన్న ట్యాగ్ లైన్లోనే ఈ సినిమాలో నాలుగు కీలక పాత్రలు ఉంటాయన్న హింట్ ఇచ్చిన దర్శకుడు ఆ పాత్రలను తొలి టీజర్లోనే పరిచయం చేసేశాడు. మహిత్, స్కూలుకు వెళ్లే 12 ఏళ్ల అమ్మాయి. అభిరామ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. గాయత్రి హౌస్ వైఫ్, సాయిరాం సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్. ఇలా సినిమాలో నాలుగు కీలక పాత్రలను టీజర్లో పరిచయం చేశాడు దర్శకుడు. చాలాకాలం తరువాత గౌతమి టాలీవుడ్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తుండగా, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు తన తొలి సినిమాలోనే ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసి, రిలీజ్‌కు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన నిర్మాత సాయి కొర్రపాటి, క్వాలిటీ పరంగా కూడా అదే స్థాయిని చూపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
మోహన్‌లాల్ తెలుగు సినిమా షూటింగ్ పూర్తి
ఐతే, ఒక్కడున్నాడు, సాహసం లాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం మళయాల సూపర్ స్టార్‌తో ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు మళయాల భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాడు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటిస్టార్ హీరోయిన్ గౌతమీతో పాటు కేరింత ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న మనమంతా
ఐతే, ఒక్కడున్నాడు, సాహసం లాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం మళయాల సూపర్ స్టార్‌తో ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు మళయాల భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాడు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటిస్టార్ హీరోయిన్ గౌతమీతో పాటు కేరింత ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.