బాల్యం.. కౌమారం.. యవ్వనం... | Image for the news result Manamantha to release in Telugu, Tamil and Malayalam | Sakshi
Sakshi News home page

బాల్యం.. కౌమారం.. యవ్వనం...

Published Sun, Jul 17 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

బాల్యం.. కౌమారం.. యవ్వనం...

బాల్యం.. కౌమారం.. యవ్వనం...

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ రెండు దశాబ్దాల తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మనమంతా’. మోహన్‌లాల్, గౌతమి, విశ్వాంత్, రైనారావు ముఖ్య తారలుగా నటించిన  ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు.వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 5న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి కొర్రపాటి మాట్లా డుతూ- ‘‘మానవ సంబంధాలు, ఎమోషన్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. బాల్యం,  కౌమారం, యవ్వన దశల్లోని ప్రయాణం నేపథ్యంలో కథ సాగుతుంది.

తెలుగుతో పాటు తమిళంలో ‘నమదు’, మలయాళంలో ‘విస్మయం’ పేరుతో ఒకే రోజు విడుదల చేస్తున్నాం. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు’’ అని తెలిపారు. అనీషా, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరాం, పరుచూరి వెంకటేశ్వరరావు, అయ్యప్ప శర్మ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: మహేష్ శంకర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement