ఒకే ప్రపంచం..నాలుగు కథలు.. మనమంతా | Mohanlal manamantha movie teaser | Sakshi
Sakshi News home page

ఒకే ప్రపంచం..నాలుగు కథలు.. మనమంతా

Jun 25 2016 12:11 PM | Updated on Sep 4 2017 3:23 AM

ఒకే ప్రపంచం..నాలుగు కథలు.. మనమంతా

ఒకే ప్రపంచం..నాలుగు కథలు.. మనమంతా

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా మనమంతా. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిరుచిగల...

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా మనమంతా. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిరుచి గల నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యింది.

తొలి టీజర్లో పాత్రల పరిచయంతో పాటు సినిమాలో ఆ పాత్రలు ప్రవర్తించే తీరును కూడా చూపించాడు దర్శకుడు. ఒకే ప్రపంచం.. నాలుగు కథలు అన్న ట్యాగ్ లైన్లోనే ఈ సినిమాలో నాలుగు కీలక పాత్రలు ఉంటాయన్న హింట్ ఇచ్చిన దర్శకుడు ఆ పాత్రలను తొలి టీజర్లోనే పరిచయం చేసేశాడు.

మహిత్, స్కూలుకు వెళ్లే 12 ఏళ్ల అమ్మాయి. అభిరామ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. గాయత్రి హౌస్ వైఫ్, సాయిరాం సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్. ఇలా సినిమాలో నాలుగు కీలక పాత్రలను టీజర్లో పరిచయం చేశాడు దర్శకుడు. చాలాకాలం తరువాత గౌతమి టాలీవుడ్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తుండగా, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు తన తొలి సినిమాలోనే ఓన్గా డబ్బింగ్ చెప్పుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇలాంటి క్రేజీ కాంబినేషన్ను సెట్ చేసి, రిలీజ్కు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన నిర్మాత సాయి కొర్రపాటి, క్వాలిటీ పరంగా కూడా అదే స్థాయిని చూపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement