పక్కింటి మహిళ!
లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు మనకు ఇష్టమైనా... సహజంగా ఉండే పాత్రలే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. నడకలో, నడతలో, కట్టూ బొట్టులో అలాంటి పాత్రలతోనే మన చుట్టూ ఉన్న మనషులను పోల్చుకుంటాం. ఇలాంటి వాళ్లను ఎక్కడో చూశాం.. మన ఇంట్లోనో, పొరుగింట్లోనో, బంధువుల్లోనో... అని ఆలోచిస్తాం. సహజంగా చిత్రీకరించే మధ్యతరగతి పాత్రలు అంతగా దగ్గరవుతాయి.
నిన్నటి తరం నాయిక గౌతమి ‘మనమంతా’ సినిమాలో ఇలాంటి పాత్రలోనే కనిపించనున్నారు. ఈ సినిమాలో గౌతమి చేసిన గాయత్రి అనే పాత్ర మధ్య తరగతి మహిళల జీవితాలను ప్రతిబింబించేలా ఉండబోతోంది. ఒక ప్రపంచంలో నాలుగు కథలు అనే కాన్సెప్ట్‌తో సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.