Rajani Korrapati
-
అల్లుడు ఆన్ లొకేషన్
మెగా అల్లుడు ఇన్ యాక్షన్. యస్... హీరోగా బుధవారం చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ యాక్షన్ మొదలు పెట్టారు. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్ దేవ్ పరిచయం అవుతున్న ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాకేశ్ శశి ప్రిపేర్ చేసిన బ్యూటిపుల్ స్క్రిప్ట్‌ను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తాం. ‘బాహుబలి’ కెమెరామేన్ సెంథిల్ ఈ సినిమాకు పని చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ఈ షెడ్యూల్లో కల్యాణ్‌తో పాటు కీలక నటీనటుల పాల్గొంటారు’’ అని అన్నారు. ఈ సినిమాకు సమర్పణ: సాయి శివాని, సంగీతం: యోగేష్, సాహిత్యం: రెహమాన్. -
రైటింగ్, టేకింగ్ కొత్తగా ఉంటాయి
‘‘అచ్యుత్, ఆనంద్.. అన్నదమ్ములు. ఇద్దరికీ పెళ్లయింది. వీరి జీవితాల్లోకి జ్యో అనే అమ్మాయి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనేది చిత్ర కథాంశం. ముక్కోణపు ప్రేమకథా చిత్రం కాదు’’ అన్నారు దర్శకుడు అవసరాల శ్రీనివాస్. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య తారలుగా అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. వారాహి చలనచిత్రం పతాకంపై శ్రీమతి రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. అవసరాల మాట్లాడుతూ - ‘‘ఊహలు గుసగుసలాడే’ రొటీన్ చిత్రం. మళ్లీ అలాంటి చిత్రమే తీస్తే దర్శకుడిగా నాపై ఓ స్టాంప్ వేస్తారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. రైటింగ్, టేకింగ్ పరంగా సినిమా కొత్తగా ఉంటుంది. అప్ కమింగ్ హీరోలు చాలామందికి ఈ కథ వినిపించా. ‘మల్టీస్టారర్ వద్దు, సోలో హీరో కథలుంటే చెప్పండి’ అన్నారు. రోహిత్ కథ వినగానే ఓకే చెప్పారు. స్క్రిప్ట్ దశలోనే శౌర్యను దృష్టిలో పెట్టుకున్నా. నాని చేసిన అతిథి పాత్ర ఏమిటనేది సస్పెన్స్. కల్యాణ్ రమణ సంగీతం చిత్రానికి ప్లస్ అయ్యింది. సాయి కొర్రపాటి గారితో రెండో చిత్రమిది. ఆయనతో మరో చిత్రం చేయాలనుకుంటున్నాను. మా వేవ్‌లెంగ్త్ అంత బాగా కుదిరింది. నా దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం చేయాలి. రెండు ఐడియాలున్నాయి. ప్రస్తుతం ‘హంటర్’ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాను. బోల్డ్ చిత్రమైనా, అందులో ఎమోషన్ నచ్చింది’’ అన్నారు. -
పక్కింటి మహిళ!
లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు మనకు ఇష్టమైనా... సహజంగా ఉండే పాత్రలే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. నడకలో, నడతలో, కట్టూ బొట్టులో అలాంటి పాత్రలతోనే మన చుట్టూ ఉన్న మనషులను పోల్చుకుంటాం. ఇలాంటి వాళ్లను ఎక్కడో చూశాం.. మన ఇంట్లోనో, పొరుగింట్లోనో, బంధువుల్లోనో... అని ఆలోచిస్తాం. సహజంగా చిత్రీకరించే మధ్యతరగతి పాత్రలు అంతగా దగ్గరవుతాయి. నిన్నటి తరం నాయిక గౌతమి ‘మనమంతా’ సినిమాలో ఇలాంటి పాత్రలోనే కనిపించనున్నారు. ఈ సినిమాలో గౌతమి చేసిన గాయత్రి అనే పాత్ర మధ్య తరగతి మహిళల జీవితాలను ప్రతిబింబించేలా ఉండబోతోంది. ఒక ప్రపంచంలో నాలుగు కథలు అనే కాన్సెప్ట్‌తో సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.