అల్లుడు ఆన్‌ లొకేషన్‌ | Chiru's son-in-law Faces Camera | Sakshi
Sakshi News home page

అల్లుడు ఆన్‌ లొకేషన్‌

Published Thu, Feb 8 2018 12:41 AM | Last Updated on Thu, Feb 8 2018 12:41 AM

Chiru's son-in-law Faces Camera  - Sakshi

కల్యాణ్‌ దేవ్‌

మెగా అల్లుడు ఇన్‌ యాక్షన్‌. యస్‌... హీరోగా బుధవారం చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ యాక్షన్‌ మొదలు పెట్టారు. రాకేశ్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో మాళవికా నాయర్‌ హీరోయిన్‌.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ పరిచయం అవుతున్న ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాకేశ్‌ శశి ప్రిపేర్‌ చేసిన బ్యూటిపుల్‌ స్క్రిప్ట్‌ను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తాం. ‘బాహుబలి’ కెమెరామేన్‌ సెంథిల్‌ ఈ సినిమాకు పని చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ఈ షెడ్యూల్‌లో కల్యాణ్‌తో పాటు కీలక నటీనటుల పాల్గొంటారు’’ అని అన్నారు. ఈ సినిమాకు సమర్పణ: సాయి శివాని, సంగీతం: యోగేష్, సాహిత్యం: రెహమాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement