
శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. గురువారం (మార్చి 6) శర్వానంద్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘‘మూడు తరాల నేపథ్యం, ప్రేమ, కలలు... వంటి అంశాల నేపథ్యంతో ముడిపడి 1990, 2000ప్రారంభంలో సాగే మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్.నారీ నారీ నడుమ మురారి: శర్వనాంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇలా బర్త్ డేకి తన ఫ్యాన్స్‌కు శర్వానంద్ డబుల్ బొనాంజ ఇచ్చారు.