New Still
-
ఏడేళ్ల తర్వాత తెలుగులో...
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే. -
ధీశాలి.. పరాక్రమశీలి...
కొండంత ఏనుగును అదుపులో పెట్టగల ధీశాలి... యుద్ధంలో శత్రువులను మృత్యు ఒడికి చేర్చే పరాక్రమశీలి... మాహిష్మతి ప్రజల మనసులు దోచుకున్న మహారాజు... అమరేంద్ర బాహుబలి. త్వరలో తన శక్తియుక్తులను చూపించడానికి, ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలిగా ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘బాహుబలి–2’. ‘బాహుబలి’కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలోని ప్రభాస్ కొత్త స్టిల్‌ను మహాశివరాత్రికి విడుదల చేశారు. ప్రస్తుతం ముఖ్య తారాగణమంతా డబ్బింగ్ చెబుతున్నారు. మరోపక్క వీఎఫ్ఎక్స్, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాను కె. రాఘవేంద్రరావు సమర్పణలో ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరకర్త.