ధీశాలి.. పరాక్రమశీలి... | Bahubali 2 Motion Poster: Sure To Give You Goosebumps! | Sakshi
Sakshi News home page

ధీశాలి.. పరాక్రమశీలి...

Published Sat, Feb 25 2017 1:07 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

ధీశాలి.. పరాక్రమశీలి... - Sakshi

ధీశాలి.. పరాక్రమశీలి...

కొండంత ఏనుగును అదుపులో పెట్టగల ధీశాలి... యుద్ధంలో శత్రువులను మృత్యు ఒడికి చేర్చే పరాక్రమశీలి... మాహిష్మతి ప్రజల మనసులు దోచుకున్న మహారాజు... అమరేంద్ర బాహుబలి. త్వరలో తన శక్తియుక్తులను చూపించడానికి, ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలిగా ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ‘బాహుబలి–2’. ‘బాహుబలి’కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలోని ప్రభాస్‌ కొత్త స్టిల్‌ను మహాశివరాత్రికి విడుదల చేశారు.

ప్రస్తుతం ముఖ్య తారాగణమంతా డబ్బింగ్‌ చెబుతున్నారు. మరోపక్క వీఎఫ్‌ఎక్స్, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తదితరులు ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాను కె. రాఘవేంద్రరావు సమర్పణలో ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement