
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది.
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే.
Comments
Please login to add a commentAdd a comment