
రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని తొలుత చిత్రం యూనిట్ ప్రకటించింది. తాజాగా ‘లాల్ సలామ్’ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తామని మంగళవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
‘‘హిందూ, ముస్లిం యువకులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట విషయంలో మతం పేరుతో గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలను మొయిద్దీన్ భాయ్ (సినిమాలో రజనీ పాత్ర) ఎలా సర్దుబాటు చేశాడు? అన్నదే చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఎ.ఆర్. రెహమాన్.