ఈద్ ముబారక్ అంటున్న హీరో | Mohanlal wishes eid mubarak on Twitter | Sakshi
Sakshi News home page

ఈద్ ముబారక్ అంటున్న హీరో

Published Wed, Jul 6 2016 12:14 PM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM

ఈద్ ముబారక్ అంటున్న హీరో - Sakshi

ఈద్ ముబారక్ అంటున్న హీరో

మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్న మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం వేషధారణలో ఉన్న తన ఫొటోనే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ కంప్లీట్ యాక్టర్.. ఇద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ పండుగలోని దైవస్ఫూర్తి మీ జీవితాల్లో ఆనందం, శాంతి కలిగించాలని ఆకాంక్షించారు.

మోహన్ లాల్ కీలక పాత్రలో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. గతంలో గాండీవం సినిమాలో ఓ పాటలో కనిపించిన మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో అలరించనున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement