షూటింగ్ పూర్తి చేసుకున్న మనమంతా | mohan lals manamantha ready to release | Sakshi
Sakshi News home page

షూటింగ్ పూర్తి చేసుకున్న మనమంతా

Published Fri, Jun 3 2016 12:48 PM | Last Updated on Sat, Jul 28 2018 6:31 PM

షూటింగ్ పూర్తి చేసుకున్న మనమంతా - Sakshi

షూటింగ్ పూర్తి చేసుకున్న మనమంతా

ఐతే, ఒక్కడున్నాడు, సాహసం లాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం మళయాల సూపర్ స్టార్తో ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. నలుగురు  వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు మళయాల భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాడు.

వారాహి చలన చిత్ర బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటిస్టార్ హీరోయిన్ గౌతమీతో పాటు కేరింత ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement