Chandra sekhar Yeleti
-
హర్ట్ అయిన రకుల్.. ప్రమోషన్లకు దూరం!
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చెక్. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే జనాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంటోంది. కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. సినిమాల్లో రకుల్ చాలా సన్నివేశాల్లో కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తోంది. అదే ప్రియ విషయానికొస్తే చేసింది చిన్న క్యారెక్టర్ అయినా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఢిల్లీ భామ(రకుల్) హర్ట్ అయినట్లు తెలుస్తోంది. చెక్‌లో తన పాత్ర కన్నా ప్రియా ప్రకాశ్ పాత్ర ఎక్కువ ఉండటం రకుల్‌కు నచ్చలేదట. అంతేగాక నితిన్, ప్రియ మధ్య ఎలాంటి పాటలు ఉండవని చెప్పి చివరికి వీరిద్దరి కలయికలో ఓ పాట కూడా చిత్రీకరించడంతో ఈ భామ హర్ట్ అయ్యిందటా. ఇంకేముంది సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చెక్కు సంబంధించిన ఏ ప్రమోషన్లలో కూడా ఆమె కనిపించలేదు. రిలీజ్‌కు ముందు చెక్ టీం ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో రకుల్ కనిపించలేదు. కానీ మరో కథానాయికగా నటిస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం మెరిసింది. అంతేగాక రకుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా రకుల్ దర్శనమివ్వకపోవడంతో అభిమానులు ఆశ్యర్యం వక్తం చేశారు. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రియనే హైలెట్ అవుతోంది. దీంతో సినిమాకు సంబంధించి ఎదో మొక్కుబడిగా ఒకటి రెండు ట్వీట్లు చేసింది తప్ప ఈ సినిమా చేసినందుకు రకుల్ సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ రకుల్‌ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ -
ఆ దర్శకుడికి నేను పెద్ద ఫ్యాన్: జూనియర్ ఎన్టీఆర్
సినిమా హిట్టు కాలేదంటే కథ బాగోలేదని దర్శకుడిని నిందించలేం. ఎందుకంటే ఫ్లాప్ అయిందన్నా, యావరేజ్ టాక్ తెచ్చుకుందన్నా దానికి బోలెడు కారణాలు ఉంటాయి. వైవిధ్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి సినిమాలు కొన్ని పెద్దగా హిట్టవ్వలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డ ఆయన ఐదేళ్ల విరామం తర్వాత చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నితిన్ హీరోగా, ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని హామీ ఇస్తున్నాడు. ఈ సినిమా రేపు(ఫిబ్రవరి 26న) విడుదల కానుంది. ఈ సందర్భంగా చెక్ యూనిట్‌కు ఆల్‌ద బెస్ట్ చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వినూత్నమైన కథలతో అలరించే చంద్రశేఖర్ యేలేటికి తనెప్పుడూ అభిమానినే అంటూ ట్వీట్ చేశాడు. చెక్ చాలా ఆసక్తికరంగా ఉందని సినిమాపై ప్రశంసలు కురిపించాడు. కాగా చంద్రశేఖర్ చెప్పిన 15 నిమిషాల కథ విని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా అని నితిన్ ఆ మధ్య స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరని, ఇందులో తన నటన వినూత్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతం అందించాడు. Always been a fan of Chandu @yeletics 's unique themes and storytelling. #Check looks super interesting. Best wishes to Chandu, @actor_nithiin and the whole team for the release tomorrow pic.twitter.com/RRwtQmSIVk — Jr NTR (@tarak9999) February 25, 2021 చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ కాలంతో పాటు వెళ్లడమే మంచిది: చంద్రశేఖర్ యేలేటి -
కాలంతో పాటు వెళ్లడమే మంచిది
‘‘నేను తీసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచి ఉండొచ్చు. కానీ ‘చెక్’ మాత్రం నిరుత్సాహపరచదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అన్నారు. నితిన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెక్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెప్పిన విశేషాలు. ► నితిన్ తో సినిమా చేయాలనుకున్నాం. రెండుమూడు కథలు అనుకున్నా కుదరలేదు. ఫైనల్‌గా ‘చెక్’ బావుంటుందనుకుని చేశాం. నితిన్‌ని మైండ్‌లో పెట్టుకుని ఈ కథ రాయలేదు. కథ పూర్తయ్యాక కలిశాను. తనకి ‘చెక్’ పాత్ర బాగా సూట్ అవుతుందని చేశాం. ఈ సినిమాలో హ్యూమన్ డ్రామా ఆకట్టుకుంటుంది. ► హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. అయితే బాగా తెలివైనవాడు. క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్ చేస్తుంటాడు. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడుతుంది. అతను క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకుంటాడు. హీరో చెస్ బాగా ఆడి వరుసగా విజయాలు సాధిస్తున్నాడని అతడిపై సానుభూతి కలిగి, ఉరిశిక్షపై రాష్ట్రపతికి అభిప్రాయం మారొచ్చు. ఆట, క్షమాభిక్ష... ఈ రెండు అంశాల నేపథ్యంలో ‘చెక్’ సన్నివేశాలు ఉంటాయి. ఈ కథలో చదరంగం ఆటకు చాలా ప్రాధాన్యం ఉంది. ► 70 శాతం సినిమా జైలులో సాగుతుంది. కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది. ‘ఐతే’ తర్వాత నేను, కల్యాణీ మాలిక్ పని చేయాలనుకున్నా పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇప్పుడు కుదరడం అదృష్టం అనుకోవాలి. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ చిత్రంలో రకుల్ న్యాయవాదిగా నటించారు. ప్రియా ప్రకాశ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ► ఆనందప్రసాద్ చాలా మంచి నిర్మాత. మొదట కథ వింటారు. కథ నచ్చితే మళ్లీ ఫైనల్ కాపీ చూస్తారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవిగారు వెనుక ఉండి నడిపిస్తుంటారు. ‘ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్డ్’ అని చాలామంది నన్ను అంటారు.. అడ్వాన్స్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి. ► ‘చెక్’ సినిమాకన్నా ముందే రెండు సినిమాలు ఒప్పుకున్నాను. వాటిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరే సంస్థలో మరో సినిమా చేస్తాను. -
నేనెవరికీ పోటీ కాదు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో 16 సినిమాలు మాత్రమే చేశా. సంగీత దర్శకుల్లో నేనెవరికీ పోటీ కాదు.. నాకెవ్వరూ పోటీ అనుకోను’’ అన్నారు కల్యాణీ మాలిక్. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ఈ నెల 26న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ – ‘‘ఐతే’ తర్వాత 17 ఏళ్లకు చందూ (చంద్రశేఖర్ యేలేటి)తో ‘చెక్’ చేశా. సంగీత దర్శకుడిగా ‘ఐతే’ నా తొలి సినిమా. అప్పుడు పని పట్ల ఎలాంటి భయం–భక్తి, ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నానో... ఇప్పటికీ అలాగే ఉన్నాను. నా కెరీర్లో హిట్, ఫ్లాప్‌లు ఉన్నాయి కానీ బ్లాక్‌బస్టర్ సినిమా లేదు. ‘చెక్’ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో ఒక పాటే ఉంది. నేపథ్య సంగీతం ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నేపథ్య సంగీతానికి 30 రోజులు పైనే పట్టింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. -
ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?!
యంగ్ హీరో నితిన్ ఖైదీగా నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్ ప్రారంభమైంది. జైల్లో ఓ పెద్దాయన ఒంటరిగా చెస్ ఆడుతుండటం చూసిన ఆదిత్య(నితిన్) ప్రత్యర్థి ఉంటేనే కిక్కు.. అంటూ ఆటలో దిగాడు. తర్వాత అతడు వేసే ఒక్కో ఎత్తుగడ చూసి ఆశ్చర్యపోవడం పెద్దాయన వంతైంది. అయితే ఆదిత్య ఆటతీరును చూసిన ఆయన చెస్‌లో ఉన్న ఒక్కో పావు గుణగణాలను చెప్తూ దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. అలా ఏనుగు, గుర్రం, ఒంటె గురించి చెప్తున్న కొద్దీ దానికి సరిగ్గా సరిపోయే పాత్రలను తెరమీద చూపించారు. మొత్తానికి కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదిత్య చదరంగంలో తోపు అని తెలుస్తోంది. (చదవండి: నితిన్ ‘చెక్’ ఫస్ట్ గింప్స్ వచ్చేసింది) కానీ టెర్రరిస్టుతో చెస్ ఆడిస్తారా? అని నిలదీస్తున్నాడో వ్యక్తి. పైగా అతడిని దేశద్రోహి అని పోలీసులు ఛీ కొడుతున్నారు. దీంతో దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది లాయర్ రకుల్. ఉరిశిక్ష పడ్డ ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఏమైనా ఉందా అని దారులు వెతుకుతోంది. కానీ ఒకానొక సమయంలో ఆ కేసు నుంచి ఎందుకు తప్పుకునేంది ఆసక్తికరంగా మారింది. రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి అన్న వ్యక్తికి 'యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి' అని రివర్స్ కౌంటరిస్తున్నాడు ఆదిత్య. సమయం దొరికినప్పుడు తోటి ఖైదీలను చితక్కొడుతున్నాడు కూడా! అసలు నితిన్ దేశద్రోహి ఎందుకయ్యాడు? అతడు ఉరి శిక్షను తప్పించుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఎత్తులకు పై ఎత్తులతో ఈజీగా చెక్ పెడుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత నితిన్ మరో చిత్రం 'రంగ్‌దే' రిలీజ్ అవుతోంది. (చదవండి: 'ఆర్ఆర్ఆర్’లో నా క్యారెక్టర్ అదే : రామ్‌చరణ్) -
నితిన్ ‘చెక్’ విడుదల తేదీ ఖరారు
యంగ్ హీరో నితిన్... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘రంగ్ దే’, ‘చెక్’, అంధాధున్ రీమెక్‌లో నటిస్తున్నారు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ విడుదలవుతుందని ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. రంగ్ దే( మార్చి 26న విడుదల) కంటే ముందే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్’ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 19న ‘చెక్’ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. -
చెక్ ఫస్ట్ గ్లింప్స్: దేశ ద్రోహిగా మారిన నితిన్
గతేడాది ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నితిన్... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం నితిన్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ‘రంగ్ దే’ మార్చి 26న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు అంధాధున్ తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ‘చెక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ‘చెక్’ ఫస్ట్ గింప్స్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్ ఆదిత్య అనే ఖైది పాత్రలో నటిస్తున్నాడు. ‘జైలులో ఆదిత్య అనే ఖైది చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు’ అని ఒక వ్యక్తి చెబుతుంతే.. ‘అద్భుతంగా అంటే? అని మరో వ్యక్తి ప్రశ్నించగా, విశ్వనాథ్ ఆనంద్, కస్పరోవ్ లాగా అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఇక పోలీస్ ఆఫీసర్ అయిన సంపత్ రాజ్.. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి ఇది నీ గుర్తింపు అంటూ నితిన్‌ని హేళన చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే.. ఒక తెలివైన వ్యక్తి అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని శిక్ష అనుభవిస్తాడని, దాని నుంచి ఎలా బయటపడ్డారనేది కథలో చూపించనున్నారు. జీవితాన్ని ముడిపెడుతూ, చెస్ లో నైపుణ్యం వున్న ఓ యువకుడి జీవితాన్ని నెరేట్ చేస్తూ అందిస్తున్న సినిమా ఇది. మనమంతా లాంటి ఫీల్ గుడ్, ఎమోషనల్ మూవీ తరువాత చంద్రశేఖర్ యేలేటి చేస్తున్న సినిమా 'చెక్' సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తుందో చూడాలి మరి. -
ప్రీలుక్ రిలీజ్: ‘చెక్’ పెట్టనున్న నితిన్
ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో అందరిని ఆకట్టుకున్న హీరో నితిన్ ప్రస్తుతం ‘రంగ్‌దే’ సినిమా చేస్తున్నాడు. కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రంగ్‌దే సినిమానే కాకుండా నితిన్.. బాలీవుడ్ ‘అంధాధున్’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి(నితిన్ తండ్రి), నిఖితారెడ్డి(నితిన్ సోదరి) నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నవంబరులో సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మధ్యే పెళ్లి చేసుకున్న నితిన్ ఇటు కొత్త సినిమాలను కూడా వెనువెంటనే ఓకే చెప్పెస్తున్నాడు. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే నితిన్ త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. (అన్ని జాగ్రత్తలతో సెట్స్ పైకి...) ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం,సాహసం, మనమంతా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో కొత్త సినిమాను చేసేందుకు నితిన్ తయారయ్యాడు. దీనికి సంబంధించిన ప్రకటనను ఈ రోజు(గురువారం) డైరెక్టర్ కొరటాల శివ అధికారికంగా విడుదల చేశారు. సినిమా పేరును చెక్‌గా ప్రకటిస్తూ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నాకు ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర యేలేటి, హీరో నితిన్‌ల కొత్త సినిమా ప్రీ లుక్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. Happy and delighted to launch the title and pre look of my favourite director #ChandraSekharYeleti and @actor_nithiin’s new movie. Wishing all the best to #BhavyaCreations pic.twitter.com/bmyT8KPPjy — koratala siva (@sivakoratala) October 1, 2020 వీ ఆనంద్ నిర్మాతగా వ్యవహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ సోస్టర్‌ను చూస్తుంటే చేతికి సంకేళ్లు, చెస్‌లోని కాయిన్స్‌తోపాటు ఇనుప కంచె కన్పిస్తోంది. దీంతో డిఫరెంట్ జోనర్లో సాగే థ్రిల్లర్ మూవీగా, ఇప్పటి వరకు నితిన్ నటించిన అన్ని సినిమాల కంటే కాస్తా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉత్తమ జాతీయ అవార్డుతోపాటు చంద్రశేఖర్ రెండు నంది అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. (డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నితిన్) -
తెలుగు సినిమాకు ఓకె చెప్పిన రకుల్!
2017లో రిలీజ్ అయిన స్పైడర్ సినిమాతో టాలీవుడ్ తెర మీద చివరి సారిగా మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ 2018లో ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. కనీసం డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. ఎక్కువగా బాలీవుడ్ మీద దృష్టి పెడుతున్న ఈ భామ గత ఏడాది హిందీ సినిమా అయ్యారిలో మాత్రమే నటించింది. ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ లాంగ్ గ్యాప్ తరువాత ఓ తెలుగు సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నితిన్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మాతో పాటు ఏలేటి సినిమాలో కూడా నటించే ఆలోచనలో ఉన్నాడు. భీష్మాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో రకుల్ ను హీరోయిన్గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
నాని సినిమాలో అనుష్క.!
టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టార్ హీరోయిన్ అనుష్క. అరుందతి, బాహుబలి, భాగమతి లాంటి చాలెంజింగ్ రోల్స్‌లో ఆకట్టుకున్న స్వీటీ మరో డిఫరెంట్ క్యారెక్టర్ కు ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి త్వరలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. బాహుబలి 2 తరువాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న స్వీటీ, చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటించేందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి. -
ఆ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా
‘అ ఆ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు హీరో నితిన్. ఆ సినిమా తరువాత వచ్చిన లై, ఛల్ మోహన్‌రంగా సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్నారు నితిన్. శతమానం భవతి లాంటి హిట్ సినిమా తీసిన సతీశ్ వేగేశ్న డైరెక్షన్లో వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. నితిన్ ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేయబోతున్నాడని సమాచారం. విభిన్న కథలతో ప్రయోగాలు చేసే ఈ దర్శకుడి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. గతంలో అనగనగా ఓ రోజు, ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా లాంటి సినిమాలు తీశారు. మరి నితిన్‌తో ఎలాంటి సినిమా తీస్తారో వేచి చూడాలి. -
గోపిచంద్ ముచ్చటగా మూడో సారి
గోపిచంద్‌కు ఒక్కడున్నాడు, సాహసం వంటి డీసెంట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. మనమంతా లాంటి డిఫరెంట్ మూవీ తరువాత యేలేటి ప్రస్తుతం గోపిచంద్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు రూపొందించే చంద్రశేఖర్ యేలేటి తొలి సినిమా నుంచి అదే పంథా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ పంతం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తైయిన వెంటనే చంద్రశేఖర్‌తో సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. ఈ మధ్యే గోపిచంద్‌ను కలిసి కథ కూడా వినిపించారని, కథ నచ్చడంతో సినిమాను ఓకే చేశారని తెలుస్తోంది. గంతలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన రెండు సినిమాలు గోపిచంద్‌కు నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ముచ్చటగా మూడోసారి తెర మీదకు వచ్చేందుకు రెడీ అవుతున్న వీరు.. ఈ సారి కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న పంతం సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. గోపిచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మంచు మనోజ్ మరో ప్రయాణం..!
స్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ ఆ స్థాయికి తగ్గ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఒకటి రెండు సినిమాలు తప్ప కెరీర్ లో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టే హిట్ ఒక్కటి కూడా పడలేదు మనోజ్‌కు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనోజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తనకు ప్రయాణం లాంటి డిఫరెంట్ సినిమాను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నా, ఇంత వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా సాధించలేదు. చివరగా మనమంతా సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా హిట్ సినిమా అని మాత్రం అనిపించలేకపోయాడు. మనోజ్ కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు ఏలేటి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..?
ఒకప్పుడు మూస సినిమాలతో బోర్ కొట్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ టైగర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు జూనియర్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లలో ఒకరితో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమర్షియల్ గా ప్రూవ్ చేసుకోలేకపోయిన చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట. ఇటీవల మనమంతా సినిమాతో ఆకట్టుకున్న చంద్రశేఖర్ చెప్పిన లైన్ ఎన్టీఆర్ కు నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేని చంద్రశేఖర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ లాంటి కమర్షియల్ హీరో నటిస్తాడా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
మనమంతాపై రాజమౌళి రివ్యూ
మంచి సినిమాలను తన స్టైల్లో ప్రమోట్ చేసే దర్శక ధీరుడు రాజమౌళి మనమంత సినిమాపై రివ్యూ రాశాడు. ప్రతీ సినిమా విషయంలో కేవలం కామెంట్స్‌కే పరిమితమయ్యే జక్కన్న.. మనమంతా సినిమాపై మాత్రం ఓ చిన్నపాటి రివ్యూనే రాశాడు. చిత్ర నటీనటులు, సాకేంతిక నిపుణులను అభినందించాడు. 'మనమంతా.. చంద్రశేఖర్ ఏలేటి, వారాహి చలన చిత్రం బ్యానర్ల కెరీర్లో టాప్ క్లాస్ సినిమాగా మిగిలిపోతుంది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నటీనటుల నుంచి అద్భుతమైన పర్ఫామెన్స్‌ను రాబ్టటాడు. మోహన్ లాల్ లాంటి మహానటుడి నుంచి నాలుగేళ్ల చిన్నారి వరకు అందరూ మనల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, చాలా కాలం పాటు మన మనసుల్లో.. ఆలోచనల్లో నిలిచిపోతారు. సినిమాలోని ప్రతీ అంశం సినీ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి టెక్స్ట్ బుక్ లాంటిది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరు మేమూ మనమంతా సినిమాకు పనిచేశాం అని గర్వంగా చెప్పుకుంటారు'. అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కేవలం ఈసినిమా చూడటం కోసం బాహుబలి షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. #Manamantha will remain a top class film in the career of chandu and vaaraahi chalana chithram.Chandu has a knack of extracting fantastic— rajamouli ss (@ssrajamouli) 5 August 2016Performances from his actors. From a seosoned actor like mohanlal garu to a 4 year old kid every one will make you smile laugh and cry and— rajamouli ss (@ssrajamouli) 5 August 2016Will remain in our hearts and thoughts for a very long time.The way the film began the way it was weaved and the way it ended is a text book— rajamouli ss (@ssrajamouli) 5 August 2016For every film student.Congratulations2 the entire unit. Everyone who worked in the film can proudly say he/she is a member of #Manamantha— rajamouli ss (@ssrajamouli) 5 August 2016 -
తెలుగు మాట్లాడుతున్నా!
‘‘తెలుగు భాష నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది’’ అని మలయాళ నటుడు మోహన్‌లాల్ అన్నారు. ఈ మలయాళ సూపర్ స్టార్ ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ‘మనమంతా’ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ చిత్రం నిర్మించారు. ఇందులో మోహన్‌లాల్ సరసన గౌతమి నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
మోహన్‌లాల్ తెలుగు సినిమా షూటింగ్ పూర్తి
ఐతే, ఒక్కడున్నాడు, సాహసం లాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం మళయాల సూపర్ స్టార్‌తో ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు మళయాల భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాడు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటిస్టార్ హీరోయిన్ గౌతమీతో పాటు కేరింత ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న మనమంతా
ఐతే, ఒక్కడున్నాడు, సాహసం లాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం మళయాల సూపర్ స్టార్‌తో ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు మళయాల భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాడు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటిస్టార్ హీరోయిన్ గౌతమీతో పాటు కేరింత ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
సౌత్ సినిమాలో ఇర్ఫాన్
విలక్షణ నటుడిగా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఇర్ఫాన్ ఖాన్ మరోసారి సౌత్ సినిమాలో కనిపించనున్నాడు. గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సైనికుడు సినిమాలో విలన్‌గా కనిపించిన ఇర్ఫాన్, చాలా కాలం తరువాత మరోసారి సౌత్ సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ నటించనున్నాడన్న టాక్ వినిపిస్తుంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి జంటగా నటిస్తున్నారు. అభిరుచి గల నిర్మాతగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్ర బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇర్ఫాన్ క్యారెక్టర్ పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా. ఈ సినిమాలో నటించడం ఖాయం అన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
తెలుగు తెరపై మోహన్‌లాల్, గౌతమి!
మోహన్‌లాల్ తెలుగులో నేరుగా నటించింది ఒక్క చిత్రమే అయినా, అనువాద చిత్రాల ద్వారా ఆయన ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘గాండీవం’ చిత్రంలో బాలకృష్ణ, ఏయన్నార్‌లతో ‘గోరువంక వాలగానే గోకులానికి...’ పాటలో కాలు కదిపిన మోహన్‌లాల్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత డెరైక్ట్ తెలుగు చిత్రంలో నటించనున్నారు. ప్రముఖ నటి గౌతమి కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి ‘ఐతే’, ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ చిత్రాల ఫేం చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘నవంబర్ మూడో వారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా నటీనటులు, సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని నిర్మాత సాయి కొర్రపాటి తెలిపారు. -
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో...వెంకీ లవ్‌స్టోరీ
కొన్ని నెలలుగా వెంకటేశ్ గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ గెటప్ కొత్త సినిమా కోసమేనన్నారు. ఓ పవర్ఫుల్ రోల్లో వెంకీ కనిపిస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, ఇప్పుడొక తాజా వార్త బయటకొచ్చింది. తాజా వార్త ఏమిటంటే,. వెంకీ ఓ ప్రేమకథా చిత్రంలో నటించనున్నారట. ‘ఐతే..’ చిత్ర ఫేమ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ఆ ప్రేమకథ ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం ఫిలింనగర్లో హాట్ టాపిక్. వెరైటీ కథాంశాలతో, స్టయిలైజ్డ్గా సినిమా తీస్తారనే పేరు చంద్రశేఖర్‌కి ఉంది. ప్రయోగాలు చేయడానికి వెనకాడని వెంకీతో ఆయన ఓ వినూత్న ప్రయత్నం చేయనున్నారని టాక్. ‘ఈగ’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’తో పాటు, 14 రీల్స్ సంస్థ భాగస్వామ్యంలో ‘లెజెండ్’ నిర్మించిన సాయి కొర్రపాటి ఈ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. -
తొలియత్నం: లెక్కలేసుకోకుండా తీసిన సినిమా!
ఐతే... డెరైక్టర్ చంద్రశేఖర్ యేలేటికి మొదటి సినిమా. సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్‌కి మొదటి సినిమా. ఆర్డ్ డెరైక్టర్ రవిందర్కి మొదటి సినిమా. మ్యూజిక్ డెరైక్టర్ కళ్యాణి మాలిక్‌కి మొదటి సినిమా. ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అనే ఆవేశంలో లాభ నష్టాల బేరీజు లేకుండా, కసితో ముందడుగు వేసిన మొండితనపు కుర్రాళ్ల కల ఇది. రిలీజ్ తరువాత మళ్లీ ‘ఐతే ఏంటి’ అనే పరిస్థితి రాలేదు. టెక్నీషియన్స్‌ను ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసి, ఇండిపెండెంట్ సినిమాకు ఇమేజ్ తెచ్చిన సినిమా అది. ఆ చిత్రం తీసే క్రమంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎదుర్కొన్న అనుభవాలు... ఆయన మాటల్లోనే. మామూలుగా టైస్టుల మీద భారీ ప్రైజ్‌లు ప్రకటిస్తుంటారు. వాళ్లను ప్రభుత్వానికి పట్టిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లోంచి పుట్టిన కథే ‘ఐతే’.నేను ‘అమృతం’ సీరియల్‌కు మొదట్లో డెరైక్టర్‌గా పనిచేశాను. దానికి సెంథిల్ కెమెరామెన్. సర్వేష్ మురారి అసిస్టెంట్ కెమెరామెన్. రవీందర్ ఆర్ట్ డెరైక్టర్. కళ్యాణిమాలిక్ మ్యూజిక్ డెరైక్టర్. అంతా కుర్రాళ్లం కాబట్టి, ఇంకా ఏదో చేయాలన్న కసితో ఉండేవాళ్లం. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ స్టెప్ గురించి ఆలోచిస్తూ, ఒక లో-బడ్జెట్ సినిమా చేద్దామనుకున్నాం. అది వర్కవుట్ అవుతుందా లేదా, ఎవరైనా తీసుకుంటారా లేదా... ఏదీ ఆలోచించనీయని యవ్వనావేశం! మొదట ఒక మాఫియా డాన్ చుట్టూ కథ అల్లుకున్నాను. డాన్ చుట్టూతా మీకు తెలిసిన కథలు చెప్పండి, అవి కాకుండా నా దగ్గర ఉన్నది కొత్తది అయితేనే ముందుకు వెళదాం అన్నాను. వాళ్లు చాలా చెప్పారు. అప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్ చెప్పేసరికి ఇదేదో కొత్తగా ఉందని అందరూ ఎక్జయిట్ అయ్యారు. తరువాత ‘అమృతం’ నిర్మాత గుణ్ణం గంగరాజుగారికి లైన్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి సినిమా తీద్దాం, మొదట నువ్వేమనుకుంటున్నావో పూర్తిగా పేపర్ మీద రాసివ్వు అన్నారు. కథ చెప్పడం చాలా ఈజీ, రాయడం చాలా కష్టం. మొదటి మూడు రోజులూ బుర్ర వేడెక్కిపోయింది. మేం నలుగురం కలిసి డిస్కస్ చేసేవాళ్లం. ఐడియాస్ షేర్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు జీవీకే వన్ ఉన్న దగ్గర అప్పుడు చైనీస్ బళ్లు ఉండేవి. అక్కడ గోడ మీద కూర్చుని గంటల తరబడి డిస్కస్ చేసుకుని, అక్కడే తినేసి రూమ్‌కు వెళ్లిపోయేవాళ్లం. రాయడం మొదలుపెట్టాక క్లారిటీ వచ్చింది. మొదట అనుకున్న ప్రకారం మినిస్టర్ కిడ్నాప్‌కి ప్లాన్ చేసి చివరకు తానే కిడ్నాప్ అవుతాడు డాన్. దీన్ని గంగరాజుగారు ఫ్లైట్ హైజాక్, కిడ్నాప్ కింద మార్చారు. అలా ప్రతి దశలోనూ ఆయన చాలా హెల్పయ్యారు. కొత్తవాళ్లతో కదా, మార్కెట్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా ఆయన మమ్మల్ని ఉత్సాహపరిచారు. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చాక, లొకేషన్స్ కోసం వెదుకులాట మొదలైంది. తలకోనతో పాటు చాలా అడవులు చూశాం. రెండు నెలల అన్వేషణ తరువాత వికారాబాద్ ఫారెస్ట్‌ను సెలక్ట్ చేసుకున్నాం. తరువాత సాంకేతిక అంశాల మీద దృష్టి పెట్టాం. కథ యువకుల జీవన పోరాటానికి సంబంధించి కాబట్టి, నేను, సెంథిల్... లైటింగ్, కాస్ట్యూమ్స్, కలర్స్ గురించి డిస్కస్ చేశాం. అమెరికన్ బ్లాక్ బుక్‌లో ఫొటోస్ రిఫరెన్స్ తీసుకుని కలర్ స్కీమ్ డిజైన్ చేసుకున్నాం. మరోవైపు ఆర్టిస్టుల ఎంపిక కీలకంగా మారింది. ఇందులో హీరో ఉండడు. నలుగురు కుర్రాళ్లు, వీళ్ల ఫ్రెండ్ ఒకమ్మాయి, డాన్, డాన్ అసిస్టెంట్... మొత్తం ఏడుగురు మెయిన్ క్యారెక్టర్స్. కొత్తవాళ్లు కావాలని ప్రకటన ఇస్తే, చాలా ఫొటోలు వచ్చాయి. షార్ట్ లిస్ట్ చేసి అభిషేక్, జనార్థన్, శశాంక్లను తీసుకున్నాం. మెయిన్ క్యారెక్టర్‌కు ఎవరూ దొరకక మొహితా చద్దాను బాంబే నుంచి తీసుకున్నాం. డాన్ క్యారెక్టర్‌కు పవన్ మల్హోత్రాతో పాటు మరొకరిని చూడటానికి నేను, గంగరాజుగారు బాంబే వెళ్లాం. వీడియో క్లిప్స్‌లో భయంకరంగా కనిపించిన పవన్, డెరైక్ట్‌గా చూస్తే చాలా చిన్నగా కనిపించాడు. అతడు పనికొస్తాడో లేదోనని నేను సందేహం వ్యక్తం చేశాను. ఆయన పవన్‌తో నా అభిప్రాయం చెప్పారు. పవన్ డాన్ గెటప్‌లో మేం ఉంటున్న హోటల్‌కు వచ్చేశారు. అంత కేర్ తీసుకుని, అంత ఇన్వాల్వ్ అయి ఆ గెటప్‌లో రావడం చూసి ఇంప్రెస్ అయిపోయాను. సింధు తులానీని చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించింది. మరో ఆలోచన లేకుండా సెలక్ట్ చేసేశాం. షూటింగ్ మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి మొదలుపెట్టాం. రోజూ సెట్లోకి రాగానే ఆ రోజు ఎన్ని క్లోజ్‌లు, ఎన్ని మిడ్‌లు, ఎన్ని వైడ్లు అని పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ సినిమాలో ఓ కీలకమైన విషయం గురించి మేం పడ్డ ఇబ్బందులు చెప్పాలి. బాంబే ఎయిర్‌పోర్ట్‌లో డాన్మీద అటాక్ జరిగే యాక్షన్ సీన్ ప్లాన్ చేశాం. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని లోకల్ ఫైట్మాస్టర్ను పెట్టుకున్నాం. అతను తన పాత పద్ధతిలో షాట్స్ కంపోజ్ చేశాడు. మాకది నచ్చలేదు. పర్మిషన్ ఉన్నది ఒక్క రాత్రికే. దాంతో రెండు మూడు షాట్స్ తీసిన తరువాత అతన్ని పక్కన పెట్టి మేమే తీయడం మొదలుపెట్టాం. అనుకున్నట్టు వచ్చింది. షూటౌట్ అయిన తరువాత డాన్ తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు. కెమెరా కాళ్ల నుంచి ఫేస్ దగ్గరకు క్రాస్‌గా ట్రావెల్ చేయాలి. క్రేన్, ట్రాలీ ఫేస్ దగ్గరికి క్రాసింగ్‌గా ఒకే లెవెల్లో వెళ్లాలి. ఆ ఇరుకు ప్లేస్‌లో ఇది కొంచెం కష్టమైన షాట్. ఐదారుసార్లు తీసినా జర్క్ వచ్చేసింది. నేను ఓకే చెప్పేశా. ఎడిటింగ్‌లో గన్ సౌండ్స్ యాడ్ చేశాను. జరిగిన అటాక్‌ను విలన్ గుర్తు తెచ్చుకుంటున్నట్టు జర్క్ దగ్గర తుపాకీ చప్పుళ్ల సౌండ్ సింక్ అయింది. మరో సీన్లో డాన్‌ను కిడ్నాప్ చేసిన తరువాత కుర్రాళ్లు చీర్స్ చెప్పుకుంటుంటారు. అప్పుడు త్రీ యాక్సిస్ రొటేషన్ టెక్నాలజీ లేకపోయినా షాట్లో అదే ఎఫెక్ట్ తీసుకొచ్చాడు సెంథిల్. అలాగే మొదటినుంచీ ఒక సాంగ్ పెడదామనుకున్నాం. దానికి కళ్యాణిమాలిక్ ఒకే ఒక ట్యూన్ ఇచ్చాడు. విన్న వెంటనే ఓకే చేసేశాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. డ్యాన్స్‌మాస్టర్ నిక్సన్ ఆధ్వర్యంలో సాంగ్ పిక్చరైజేషన్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాం. ఇక క్లైమాక్స్ సీన్లో బాంబ్ బ్లాస్ట్‌కు కార్ డిక్కీ లేచి పడాలి. స్పెషల్ ఎఫెక్స్ట్ వాళ్లు కాలిక్యులేట్ చేసి డిక్కీ ఆరు ఫీట్లు ఎగురుతుందని చెప్పారు. కానీ షూట్ చేసేటప్పుడు బాంబు ధాటికి డిక్కీ పైకి లేచి, ఎలక్ట్రిక్ పోల్కి తగిలి సర్క్యూట్ సంభవించింది. దాంతో రెండు గంటలపాటు వికారాబాద్‌కు కరెంట్ సప్లై నిలిచిపోయింది. అది పొరబాటున యూనిట్ వైపు పడి ఉంటే చాలా ప్రమాదం జరిగేది. మా ప్రొడక్షన్‌వాళ్లు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సమస్యను పరిష్కరించారు. అంతేకాక, వర్షం వల్ల వరుసగా రెండు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. అప్పుడు కొంచెం టెన్షన్ పడినా, మొత్తానికి 63 రోజుల్లో పూర్తి చేశాం. అది కూడా ద్విభాషా చిత్రం కాబట్టి. పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్‌కు మాత్రం టైమ్ పట్టింది. వాయిస్‌లు నేచురల్‌గా ఉండాలి కాబట్టి డబ్బింగ్ ఎక్కువ సమయం తీసుకుంది. న్యాచురల్ ఫిలింస్‌కు అప్పట్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. సినిమా పూర్తయిన మూడు నెలలకు కూడా విడుదల కాలేదు. కొంతమంది బాలేదన్నారు కూడా. మరీ అంత దారుణంగా తీశామా అనుకున్నాం. ఆ టైమ్‌లో మా ప్రొడ్యూసర్ మాకు చాలా ధైర్యాన్నిచ్చారు. రామ్‌గోపాల్‌వర్మని సినిమా చూడమంటే చూడనన్నారు. బాగుంటే ఓకే, బాగోలేకపోతే నేనే కామెంట్ చేస్తే అది మీకే నష్టం అన్నారు. ఫర్వాలేదని బీటా ప్రొజెక్షన్లో చూపించాం. ఆయనకు విపరీతంగా నచ్చింది. మా యూనిట్ నుండి కాకుండా బయటివాళ్ల నుంచి వచ్చిన మొదటి పాజిటివ్ కాంప్లిమెంట్ అదే. తరువాత రామానాయుడు స్టూడియోకు డీటీఎస్ మిక్సింగ్‌కు పంపించాం. ఆడియోగ్రాఫర్ మధుసూదన్‌రెడ్డి ఇంటర్వెల్ వరకు చూసి అద్భుతంగా ఉందన్నారు. సినిమా విడుదలయ్యాక, లైట్‌బాయ్స్ ఒక విషయం చెప్పారు. షూటింగ్లో మా తపన చూసి కుర్రాళ్లు ఏదో కష్టపడుతున్నారు, అసలు సినిమా ఏమైనా నడుస్తుందా అనుకున్నారట. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని వాళ్లు అస్సలు అనుకోలేదట. స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్‌ప్రొడక్షన్ వరకు ప్రతి దశలో అందరం ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టే అంత పెద్ద సక్సెస్ వచ్చిందనుకుంటాను. కెమెరా, కలర్స్, లైటింగ్ విషయాల్లో ప్రయోగాలు చేసి సినిమాను వాస్తవికతకు దగ్గరగా ఉండేట్టు తీశాం. ఈ సినిమాకు అసలు బలం స్క్రీన్‌ప్లే. అందుకు నామీద సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ల ప్రభావం ఉండటం కారణం కావచ్చు. గంగరాజుగారి డైలాగ్స్ సూపర్బ్‌గా హెల్పయ్యాయి. ఎడిటర్ సుధాకర్ కూడా ప్లస్సయ్యారు. సినిమాను ఫాస్ట్ పేస్డ్ నేరేషన్లో నడిపాడు. హిందీలో ‘పచాస్లాక్’ అనే పేరు పెట్టి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కు అమ్మేశాం. తెలుగులో విడుదలైన రెండు మూడేళ్లకు వాళ్లు హిందీలో రిలీజ్ చేశారు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి