చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో...వెంకీ లవ్‌స్టోరీ | Venkatesh in Chandrasekhar Yeletis direction ? | Sakshi
Sakshi News home page

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో...వెంకీ లవ్‌స్టోరీ

Published Sun, Jul 12 2015 12:04 AM | Last Updated on Sat, Jul 28 2018 6:16 PM

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో...వెంకీ లవ్‌స్టోరీ - Sakshi

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో...వెంకీ లవ్‌స్టోరీ

కొన్ని నెలలుగా వెంకటేశ్ గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ గెటప్ కొత్త సినిమా కోసమేనన్నారు. ఓ పవర్‌ఫుల్ రోల్‌లో వెంకీ కనిపిస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, ఇప్పుడొక తాజా వార్త బయటకొచ్చింది. తాజా వార్త ఏమిటంటే,. వెంకీ ఓ ప్రేమకథా చిత్రంలో నటించనున్నారట. ‘ఐతే..’ చిత్ర ఫేమ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ఆ ప్రేమకథ ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్. వెరైటీ కథాంశాలతో, స్టయిలైజ్డ్‌గా సినిమా తీస్తారనే పేరు చంద్రశేఖర్‌కి ఉంది. ప్రయోగాలు చేయడానికి వెనకాడని వెంకీతో ఆయన ఓ వినూత్న ప్రయత్నం చేయనున్నారని టాక్. ‘ఈగ’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’తో పాటు, 14 రీల్స్ సంస్థ భాగస్వామ్యంలో ‘లెజెండ్’ నిర్మించిన సాయి కొర్రపాటి ఈ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement