
‘అ ఆ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు హీరో నితిన్. ఆ సినిమా తరువాత వచ్చిన లై, ఛల్ మోహన్‌రంగా సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్నారు నితిన్. శతమానం భవతి లాంటి హిట్ సినిమా తీసిన సతీశ్ వేగేశ్న డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
నితిన్ ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేయబోతున్నాడని సమాచారం. విభిన్న కథలతో ప్రయోగాలు చేసే ఈ దర్శకుడి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. గతంలో అనగనగా ఓ రోజు, ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా లాంటి సినిమాలు తీశారు. మరి నితిన్‌తో ఎలాంటి సినిమా తీస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment