
Comedian Brahmanandam Sacked From Nithiin Movie?: ఒకప్పుడు ఏడాది పొడవునా వరుస పెట్టి సినిమాలు చేసే టాలీవుడ్ హాస్యబ్రహ్మ, ప్రముఖ నటుడు బ్రహ్మానందం కొంతకాలంగా సినిమాల సంఖ్యను తగ్గించాడు. వయస్సు రీత్యా ప్రస్తుతం ఆయన పరిమిత స్థాయిలో సినిమాలకు మాత్రమే టైం కేటాయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి బ్రహ్మానందంను తొలిగించి నితిన్ ఆయనకు షాక్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్‌లో ఈ వార్త హాట్‌టాపిక్‌గా మారింది. నితిన్‌కు బ్రహ్మీకి మధ్య ఏం జరిగిందని, ఆయనను సినిమా నుంచి తొలగించేంత పెద్ద విషయం ఏం జరిగిందా? అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దీనికి కారణం ఇదేనంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కోసం మూవీ టీం వైజాగ్ వెళ్లారని, ఈ 10 రోజుల షూటింగ్ షెడ్యూల్‌కు నితిన్‌తో పాటు బ్రహ్మానందం కూడా పాల్గొనాల్సి ఉందట. కానీ బ్రహ్మానందం అనుకున్న సమయానికి షూటింగ్‌కు రాకపోవడం, డైరెక్టర్ చెప్పినట్టు చేయకపోవడంతోనే ఆయనను సినిమా నుంచి తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట. అయితే దీనిపై డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ నుంచి ఎలాంటి కామెంట్ రాలేదు.
ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం తీరుతో విసుగిపోయిన నితిన్ ఆయనను పక్కకు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాకు బ్రహ్మీ ఒక్క రోజుకు 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే 10 రోజులకు రూ. 50 లక్షలన్నమాట. ఈ పారితోషికాన్ని అడ్వాన్స్‌గానే చెల్లించాడట నితిన్. అయితే పారితోషికం నష్టపోయిన ఫర్వాలేదు కానీ ఆయనను భరించాల్సి అవసరం లేదని మేకర్స్ అభిప్రాయపడ్డంటూ టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే నితిన్ కానీ, మూవీ టీం కానీ ఈ రూమార్స్‌పై స్పందించే వరకు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment