గోపిచంద్‌కు ఒక్కడున్నాడు, సాహసం వంటి డీసెంట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. మనమంతా లాంటి డిఫరెంట్ మూవీ తరువాత యేలేటి ప్రస్తుతం గోపిచంద్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు రూపొందించే చంద్రశేఖర్ యేలేటి తొలి సినిమా నుంచి అదే పంథా కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం గోపిచంద్ పంతం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తైయిన వెంటనే చంద్రశేఖర్‌తో సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. ఈ మధ్యే గోపిచంద్‌ను కలిసి కథ కూడా వినిపించారని, కథ నచ్చడంతో సినిమాను ఓకే చేశారని తెలుస్తోంది. గంతలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన రెండు సినిమాలు గోపిచంద్‌కు నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ముచ్చటగా మూడోసారి తెర మీదకు వచ్చేందుకు రెడీ అవుతున్న వీరు.. ఈ సారి కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న పంతం సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. గోపిచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment