okkadunnadu
-
గోపిచంద్ ముచ్చటగా మూడో సారి
గోపిచంద్‌కు ఒక్కడున్నాడు, సాహసం వంటి డీసెంట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. మనమంతా లాంటి డిఫరెంట్ మూవీ తరువాత యేలేటి ప్రస్తుతం గోపిచంద్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు రూపొందించే చంద్రశేఖర్ యేలేటి తొలి సినిమా నుంచి అదే పంథా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ పంతం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తైయిన వెంటనే చంద్రశేఖర్‌తో సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. ఈ మధ్యే గోపిచంద్‌ను కలిసి కథ కూడా వినిపించారని, కథ నచ్చడంతో సినిమాను ఓకే చేశారని తెలుస్తోంది. గంతలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన రెండు సినిమాలు గోపిచంద్‌కు నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ముచ్చటగా మూడోసారి తెర మీదకు వచ్చేందుకు రెడీ అవుతున్న వీరు.. ఈ సారి కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న పంతం సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. గోపిచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ప్రజల కోసం ఒక్కడు
ప్రతి ఊరిలోనూ ప్రజల సమస్యలను పరిష్కరించ డానికి, అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం బిగించాలి. అలా ప్రజలకు న్యాయం చేయడానికి నడుం బిగించిన ఓ యువకుడికథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. విశాల్, తమన్నా జంటగా సూరజ్ దర్శకత్వంలో జి.హరి నిర్మిస్తున్న చిత్రమిది. విశాల్ బర్త్‌డే సందర్భంగా నేడు టీజర్ విడుదల చేస్తున్నారు. విశాల్ మాట్లాడుతూ - ‘‘ప్రతి ఊరిలోనూ ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యతో చిత్రం తెరకెక్కుతోంది. నా లుక్, పాత్ర చిత్రణ గత చిత్రాల కంటే విభిన్నంగా, కొత్తగా ఉంటాయి. ఈ చిత్రం తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు. ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. శ్రుతీ హాసన్ ఓ పాట పాడడం విశేషం. దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత జి.హరి తెలిపారు. జగపతిబాబు, తరుణ్ అరోరా, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: రిచర్డ్ ఎం.నాథన్, మ్యూజిక్: హిప్హాప్ తమిళ, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్, సమర్పణ: ఎం.పురుషోత్తమ్.