ప్రజల కోసం ఒక్కడు | Tamanna and Vishal pairing for first time | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం ఒక్కడు

Published Sun, Aug 28 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

ప్రజల కోసం ఒక్కడు

ప్రజల కోసం ఒక్కడు

ప్రతి ఊరిలోనూ ప్రజల సమస్యలను పరిష్కరించ డానికి, అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం బిగించాలి. అలా ప్రజలకు న్యాయం చేయడానికి నడుం బిగించిన ఓ యువకుడికథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. విశాల్, తమన్నా జంటగా సూరజ్ దర్శకత్వంలో జి.హరి నిర్మిస్తున్న చిత్రమిది. విశాల్ బర్త్‌డే సందర్భంగా నేడు టీజర్ విడుదల చేస్తున్నారు. విశాల్ మాట్లాడుతూ - ‘‘ప్రతి ఊరిలోనూ ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యతో చిత్రం తెరకెక్కుతోంది. నా లుక్, పాత్ర చిత్రణ గత చిత్రాల కంటే విభిన్నంగా, కొత్తగా ఉంటాయి.
 
 ఈ చిత్రం  తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు. ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. శ్రుతీ హాసన్ ఓ పాట పాడడం విశేషం. దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత జి.హరి తెలిపారు. జగపతిబాబు, తరుణ్ అరోరా, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: రిచర్డ్ ఎం.నాథన్, మ్యూజిక్: హిప్‌హాప్ తమిళ, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్, సమర్పణ: ఎం.పురుషోత్తమ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement