తెలుగు సినిమాకు ఓకె చెప్పిన రకుల్‌! | Nithin to Romance Rakul Preet In Chandra Sekhar Yeleti Film | Sakshi
Sakshi News home page

Dec 27 2018 11:14 AM | Updated on Dec 27 2018 2:36 PM

Nithin to Romance Rakul Preet In Chandra Sekhar Yeleti Film - Sakshi

2017లో రిలీజ్‌ అయిన స్పైడర్‌ సినిమాతో టాలీవుడ్ తెర మీద చివరి సారిగా మెరిసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 2018లో ఒక్క తెలుగు  సినిమాలో కూడా నటించలేదు. కనీసం డబ్బింగ్‌ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. ఎక్కువగా బాలీవుడ్ మీద దృష్టి పెడుతున్న ఈ భామ గత ఏడాది హిందీ సినిమా అయ్యారిలో మాత్రమే నటించింది. ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న  రకుల్‌ లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఓ తెలుగు సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నితిన్‌, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మాతో పాటు ఏలేటి సినిమాలో కూడా నటించే ఆలోచనలో ఉన్నాడు. భీష్మాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా చంద్రశేఖర్‌ ఏలేటి సినిమాలో రకుల్‌ ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement