టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చెక్. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే జనాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంటోంది. కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. సినిమాల్లో రకుల్ చాలా సన్నివేశాల్లో కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తోంది. అదే ప్రియ విషయానికొస్తే చేసింది చిన్న క్యారెక్టర్ అయినా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఢిల్లీ భామ(రకుల్) హర్ట్ అయినట్లు తెలుస్తోంది. చెక్‌లో తన పాత్ర కన్నా ప్రియా ప్రకాశ్ పాత్ర ఎక్కువ ఉండటం రకుల్‌కు నచ్చలేదట. అంతేగాక నితిన్, ప్రియ మధ్య ఎలాంటి పాటలు ఉండవని చెప్పి చివరికి వీరిద్దరి కలయికలో ఓ పాట కూడా చిత్రీకరించడంతో ఈ భామ హర్ట్ అయ్యిందటా.
ఇంకేముంది సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చెక్‌కు సంబంధించిన ఏ ప్రమోషన్లలో కూడా ఆమె కనిపించలేదు. రిలీజ్‌కు ముందు చెక్ టీం ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో రకుల్ కనిపించలేదు. కానీ మరో కథానాయికగా నటిస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం మెరిసింది. అంతేగాక రకుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా రకుల్ దర్శనమివ్వకపోవడంతో అభిమానులు ఆశ్యర్యం వక్తం చేశారు. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రియనే హైలెట్ అవుతోంది. దీంతో సినిమాకు సంబంధించి ఎదో మొక్కుబడిగా ఒకటి రెండు ట్వీట్లు చేసింది తప్ప ఈ సినిమా చేసినందుకు రకుల్ సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment