సౌత్ సినిమాలో ఇర్ఫాన్ | irfan khan doing a multilingual film in south | Sakshi
Sakshi News home page

సౌత్ సినిమాలో ఇర్ఫాన్

Published Thu, Oct 15 2015 10:58 AM | Last Updated on Sat, Jul 28 2018 6:31 PM

సౌత్ సినిమాలో ఇర్ఫాన్ - Sakshi

సౌత్ సినిమాలో ఇర్ఫాన్

విలక్షణ నటుడిగా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఇర్ఫాన్ ఖాన్ మరోసారి సౌత్ సినిమాలో కనిపించనున్నాడు. గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సైనికుడు సినిమాలో విలన్గా కనిపించిన ఇర్ఫాన్, చాలా కాలం తరువాత మరోసారి సౌత్ సినిమాలో నటిస్తున్నాడు.

క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ నటించనున్నాడన్న టాక్ వినిపిస్తుంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి జంటగా నటిస్తున్నారు. అభిరుచి గల నిర్మాతగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్ర బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇర్ఫాన్ క్యారెక్టర్ పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా. ఈ సినిమాలో నటించడం ఖాయం అన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement