
టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టార్ హీరోయిన్ అనుష‍్క. అరుందతి, బాహుబలి, భాగమతి లాంటి చాలెంజింగ్ రోల్స్‌లో ఆకట్టుకున్న స్వీటీ మరో డిఫరెంట్ క్యారెక్టర్ కు ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి త్వరలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నాడు.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. బాహుబలి 2 తరువాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న స్వీటీ, చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటించేందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment