సింగిల్‌ సాంగ్‌కు రూ.2కోట్లా..! ఎవరామె..? | anushka demanding rs 2 crores for a song | Sakshi
Sakshi News home page

సింగిల్‌ సాంగ్‌కు రూ.2కోట్లా..! ఎవరామె..?

Published Wed, Jul 19 2017 6:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

సింగిల్‌ సాంగ్‌కు రూ.2కోట్లా..! ఎవరామె..?

సింగిల్‌ సాంగ్‌కు రూ.2కోట్లా..! ఎవరామె..?

హైదరాబాద్‌: దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరుగా ఉన్న నటి అనుష్క. బాహుబలి -2 సమయంలో అంగీకరించిన భాగమతి చిత్రం మినహా ఈమెకు చేతిలో చిత్రాలు లేవు. బాహుబలి 2 చిత్రం తరువాత వచ్చని అవకాశాలను తిరస్కరిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. దీంతో ఈ అమ్మడి గురించి రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. అందులో ఒకటి పెళ్లి. అనుష్కకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ, కుదిరితే త్వరలోనే అనుష్క ఇంట పీపీపీ..డుండుండుమ్మేననే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే అనుష్క ఇటీవల గుళ్లు, గోపురాలు అంటూ చుట్టేశారు.

తాజాగా అనుష్క ఒక టాలీవుడ్‌ చిత్రంలో సింగిల్‌సాంగ్‌ చేయడానికి ఒకే చేసినట్లు సమాచారం. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రం అని ప్రచారం హల్‌ చల్‌ చేస్తోంది. అంతే కాదు ఈ పాటలో మహేశ్‌బాబుతో లెగ్‌షేక్‌ చేయడానికి అక్షరాలా రూ .2 కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది పక్కన పెడితే ఈ విషయమై సోషల్‌ మీడియాలో చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అసలు మహేశ్‌బాబు తాజా చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదన్నది గమనార్హం. ఇంతకు ముందు కూడా నటి తమన్నా రెండు, మూడు చిత్రాలలో ఐటమ్‌ సాంగ్‌కు కోటీ, రెండు కోట్లు డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వారసుడు నటించిన జాగ్వర్‌ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ కోసం మిల్కీబ్యూటీ రెండు కోట్లు పుచ్చుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన జనతాగ్యారేజ్‌ చిత్రంలో నేను పక్కాలోకల్‌ అంటూ డాన్స్‌లో ఇరగదీసిన కాజల్‌అగర్వాల్‌ కూడా అందుకు భారీ పారితోషికాన్నే పుచ్చుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement