Sitara Ghattamaneni PMJ Jewellery Ad Remuneration, Details Inside - Sakshi
Sakshi News home page

Sitara Ad Remuneration: చిన్న యాడ్.. కళ్లుచెదిరే మొత్తం ఇచ్చారు!

Published Wed, Jul 5 2023 6:39 PM | Last Updated on Thu, Jul 6 2023 7:05 AM

Sitara Ghattamaneni Jewellery Ad Remuneration Details - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాలతో బిజీగా ఉంటే.. కూతురు సితార మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. చిన్న వయసులో యాడ్ షూట్ లో పాల్గొన్న స్టార్ కిడ్ గా ఘనత సాధించింది. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ ఎక్కడికో వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. చేసింది జ్యూవెల‍్లరీ యాడ్ అయితేనేం.. సితారకు పెద్ద మొత్తమే ఇచ్చారని మాట‍్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? 

(ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస‍్తున్న స్టార్ హీరోలు!)

సూపర్‌స్టార్ మహేశ్.. ఏడాది లేదా ఏడాదిన్నరకు ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. కానీ యాడ్స్, ప్రమోషన్స్ రూపంలో మరోవైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు. పాన్ మసాలా దగ్గర నుంచి సోప్ వరకు ప్రతిదానిలోనూ యాక్ట్ చేస్తుంటాడు. కోట్లకు కోట్లు ఆర్జిస్తుంటాడు. మహేశ్ ఫ్యామిలీ అంతా కలిసి గతంలో ఓ యాడ్ లో కనిపించారు. ఆ తర్వాత కూతురు సితారకు పలు ఆఫర్స్ వచ్చాయట. కానీ ఎందుకో మహేశ్ వాటిని ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం జ్యూవెల్లరీ యాడ్ లో సితార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కొన్నాళ్ల ముందు ఈ యాడ్ షూట్ జరగ్గా.. ఆ వీడియోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో తాజాగా ప్రదర్శించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేశ్.. కూతురు ఎదుగుదల చూసి తెగ ఆనందపడిపోయాడు. చాలా ఆఫర్లకు ఒప్పుకోని మహేశ్.. ఇలా ఈ యాడ్ కి ఎలా అంగీకరించాడా అని మీకు డౌట్ రావొచ‍్చు. అయితే ఇందులో సితార యాక్ట్ చేసినందుకు గానూ ఏకంగా రూ.కోటి ఇచ్చారట. బహుశా మహేశ్ కూడా తన తొలి యాడ్ కోసం కూడా ఇంత తీసుకుని ఉండడు. అందుకే సితార యాడ్ షూట్ కి ఒప్పుకున్నాడేమో?

(ఇదీ చదవండి: ఓ పక్క పెళ్లి.. మరో పక్క విడాకులు.. మెగా ఫ్యామిలీకి ఎందుకిలా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement