నవీన్ పొలిశెట్టి, ప్రమోద్, మహేశ్‌బాబు
‘‘ఒక యాక్సిడెంట్‌లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా ‘జాతి రత్నాలు’ సినిమాని రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అందుకే ‘జాతి రత్నాలు’ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఒత్తిడికి గురయ్యాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన కథ చాలా ఎగ్జయిట్ చేసింది. మానవ సంబంధాల మీద మంచి ఎంటర్‌టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. స్టాండప్ కామెడీ క్యారెక్టర్‌తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. అది నచ్చింది.
అలాగే అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు పి. దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘పెళ్లి ఒక్కటే కాదు.. ప్రతి రిలేషన్‌లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు పి. మహేశ్ బాబు.
Comments
Please login to add a commentAdd a comment