హడావిడి తగ్గాకే బరిలోకి..! | Nani Next Movie Release Date | Sakshi
Sakshi News home page

హడావిడి తగ్గాకే బరిలోకి..!

Mar 21 2017 12:18 PM | Updated on Sep 5 2017 6:42 AM

హడావిడి తగ్గాకే బరిలోకి..!

హడావిడి తగ్గాకే బరిలోకి..!

వరుసగా మూడు నెలలపాటు భారీ సినిమాలు బరిలో ఉండటంతో చిన్న మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలను కాస్త ఆలస్యం

వరుసగా మూడు నెలలపాటు భారీ సినిమాలు బరిలో ఉండటంతో చిన్న మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలను కాస్త ఆలస్యం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాహుబలి, మహేష్ 23ల తో పోటి పడి నష్టపోవటం కన్నా.. హడావిడి తగ్గాక, తీరిగ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యంగ్ హీరో నాని కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం కొత్త దర్శకుడు శివ నిర్వాణా దర్శకత్వంలో నిన్ను కోరి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు నాని.

ఇప్పటికే అమెరికాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వరుసగా బాహుబలి, డీజే దువ్వాడ జగన్నాథమ్, మహేష్ 23 సినిమాలు ఏప్రిల్, మే, జూన్ నెలలో రిలీజ్ అవుతుండటంతో తన సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మహేష్, మురుగదాస్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాల తరువాత తన సినిమాను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement