నేనెవరికీ పోటీ కాదు | Iam Not Competent To Any One Says Music Director Kalyani Malik | Sakshi
Sakshi News home page

నేనెవరికీ పోటీ కాదు

Feb 17 2021 12:08 AM | Updated on Feb 17 2021 8:02 AM

Iam Not Competent To Any One Says Music Director Kalyani Malik - Sakshi

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో 16 సినిమాలు మాత్రమే చేశా. సంగీత దర్శకుల్లో నేనెవరికీ పోటీ కాదు.. నాకెవ్వరూ పోటీ అనుకోను’’ అన్నారు కల్యాణీ మాలిక్‌. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’. ఈ నెల 26న సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా చిత్ర  సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్‌  మాట్లాడుతూ – ‘‘ఐతే’ తర్వాత  17 ఏళ్లకు చందూ (చంద్రశేఖర్‌ యేలేటి)తో ‘చెక్‌’ చేశా. సంగీత దర్శకుడిగా ‘ఐతే’ నా తొలి సినిమా. అప్పుడు పని పట్ల ఎలాంటి భయం–భక్తి, ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నానో... ఇప్పటికీ అలాగే ఉన్నాను. నా కెరీర్‌లో హిట్, ఫ్లాప్‌లు ఉన్నాయి కానీ బ్లాక్‌బస్టర్‌ సినిమా లేదు. ‘చెక్‌’ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో ఒక పాటే ఉంది. నేపథ్య సంగీతం ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నేపథ్య సంగీతానికి 30 రోజులు పైనే పట్టింది. ప్రస్తుతం రెండు వెబ్‌ సిరీస్‌లకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement