Anand Prasad
-
హంట్: కనిపించని శత్రువు కోసం సుధీర్‌బాబు వేట!
సుధీర్‌బాబు హీరోగా, శ్రీకాంత్, భరత్(‘ప్రేమిస్తే’ ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ‘హంట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. సుధీర్‌బాబు, శ్రీకాంత్, భరత్ పోలీసు పాత్రలు పోషించారు. కనిపించని శత్రువు కోసం హీరో జరిపే వేట ఈ చిత్రం ప్రధాన కథాంశం. సుధీర్‌బాబు గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీలో క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. భరత్ తెలుగులో చేసిన తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు. మైమ్ గోపీ, కబీర్ దుహాన్ సింగ్, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు సంగీతం: జీబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. చదవండి: ఒకే భవనంలో అపార్ట్మెంట్స్ కొన్న స్టార్ హీరోలు! -
నేనెవరికీ పోటీ కాదు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో 16 సినిమాలు మాత్రమే చేశా. సంగీత దర్శకుల్లో నేనెవరికీ పోటీ కాదు.. నాకెవ్వరూ పోటీ అనుకోను’’ అన్నారు కల్యాణీ మాలిక్. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ఈ నెల 26న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ – ‘‘ఐతే’ తర్వాత 17 ఏళ్లకు చందూ (చంద్రశేఖర్ యేలేటి)తో ‘చెక్’ చేశా. సంగీత దర్శకుడిగా ‘ఐతే’ నా తొలి సినిమా. అప్పుడు పని పట్ల ఎలాంటి భయం–భక్తి, ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నానో... ఇప్పటికీ అలాగే ఉన్నాను. నా కెరీర్లో హిట్, ఫ్లాప్‌లు ఉన్నాయి కానీ బ్లాక్‌బస్టర్ సినిమా లేదు. ‘చెక్’ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో ఒక పాటే ఉంది. నేపథ్య సంగీతం ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నేపథ్య సంగీతానికి 30 రోజులు పైనే పట్టింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. -
నాగశౌర్యకు మరో షాక్!
ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమాల సక్సెస్ తో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన నాగశౌర్య తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. ఛలో సక్సెస్ తరువాత వరుస అవకాశాలతో బిజీ అయినట్టుగా కనిపించినా ఇప్పుడు ఒక్కో సినిమా చేజారుతోంది. ఇప్పటికే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. తాజాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఆనంద్ ప్రసాద్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రారంభమైన సినిమా కూడా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న లేడి ఓరియంటెడ్ సినిమాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బేబిలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. -
వెంకటేశ్వరుని ఆశీస్సులతో...
‘ఛలో’ చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు నాగశౌర్య. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై రాజా కొలుసును దర్శకునిగా పరిచయం చేస్తూ వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే తెలియచేస్తామని ఆనందప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆనంద ప్రసాద్ సతీమణి కృష్ణకుమారి, హీరో నాగశౌర్య తల్లిదండ్రులు ఉషాబాల, శంకరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరాం, సంగీతం: సాగర్ మహతి, ఆర్ట్: వివేక్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కథ–స్క్రీన్‌ప్లే–మాటలు–దర్శకత్వం: రాజా కొలుసు. -
శ్రీవారికి రూ.కోటి విరాళమిచ్చిన వ్యాపారవేత్త
తిరుమల: టీటీడీకి ఓ భక్తుడు కోటి రూపాయలను విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోటి రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో టీటీడీ ఈవో సాంబశివరావుకు అందజేశారు. ఈ నిధులను టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ బర్డ్ ట్రస్ట్‌కు విరాళంగా ఇస్తున్నట్టు తెలియజేశారు. -
అంతకు మించిన హీరోయిజమ్ ఉంటుంది: గోపీచంద్
గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, రచయిత శ్రీధర్ సీపాన క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ - ‘‘ ‘లౌక్యం’ తర్వాత శ్రీధర్ చాలా మంచి కథతో వచ్చారు. ‘యజ్ఞం’ తర్వాత పదేళ్లకు మళ్లీ రవికుమార్ చౌదరితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది . కోనవెంకట్, గోపీమోహన్‌ల మీద చాలా నమ్మకం ఉంది. వాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే ఈ సినిమా ఒప్పుకున్నా. ‘లౌక్యం’ సినిమాను మించిన హీరోయిజమ్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘గోపీచంద్‌కు, మా సంస్థకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలో శ్రీధర్ సీపానను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఓ చిత్రం నిర్మించనున్నాం’’ అని తెలిపారు. రవికుమార్ చౌదరి మాట్లాడుతూ- ‘‘శ్రీధర్ సీపాన మంచి స్టోరీ ఇచ్చారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం ’’ అని చెప్పారు. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ- ‘‘రొటీన్‌కి భిన్నంగా గోపీచంద్ శైలిలో సాగే సరికొత్త కథ ఇది. ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్, ఆనంద్ర పసాద్, అన్నే రవిలను ఎప్పటికీ మర్చిపోను ’’ అని అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘రవికుమార్ చౌదరి తీసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా చూసి థ్రిల్ అయ్యా. గోపీచంద్‌తో సినిమా చేసేవాళ్లందరూ ఆయనతో లవ్‌లో పడతారు’’ అన్నారు. గోపీమోహన్ మాట్లాడుతూ- ‘‘ ‘లౌక్యం’లో కామెడీ పాళ్లు ఎక్కువ. కానీ ఇందులో కామెడీ, యాక్షన్‌తో పాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయి’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, రచన: ఘటికాచలం, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై. -
గోపిచంద్ న్యూ మూవీ ఒపెనింగ్