అంతకు మించిన హీరోయిజమ్ ఉంటుంది: గోపీచంద్ | Gopichand New Movie Opening | Sakshi
Sakshi News home page

అంతకు మించిన హీరోయిజమ్ ఉంటుంది: గోపీచంద్

Published Sun, Jun 7 2015 10:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

అంతకు మించిన హీరోయిజమ్ ఉంటుంది: గోపీచంద్

అంతకు మించిన హీరోయిజమ్ ఉంటుంది: గోపీచంద్

 గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి  ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా,  రచయిత శ్రీధర్ సీపాన క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ - ‘‘ ‘లౌక్యం’ తర్వాత శ్రీధర్ చాలా మంచి కథతో వచ్చారు.  ‘యజ్ఞం’ తర్వాత పదేళ్లకు మళ్లీ  రవికుమార్ చౌదరితో  వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది . కోనవెంకట్, గోపీమోహన్‌ల మీద చాలా నమ్మకం ఉంది. వాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే ఈ సినిమా  ఒప్పుకున్నా.
 
  ‘లౌక్యం’ సినిమాను మించిన  హీరోయిజమ్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది’’ అని చెప్పారు.  నిర్మాత మాట్లాడుతూ- ‘‘గోపీచంద్‌కు, మా సంస్థకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు. త్వరలో శ్రీధర్  సీపానను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఓ చిత్రం నిర్మించనున్నాం’’ అని తెలిపారు. రవికుమార్ చౌదరి  మాట్లాడుతూ- ‘‘శ్రీధర్ సీపాన మంచి స్టోరీ ఇచ్చారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం ’’ అని చెప్పారు. శ్రీధర్ సీపాన  మాట్లాడుతూ- ‘‘రొటీన్‌కి భిన్నంగా గోపీచంద్ శైలిలో సాగే సరికొత్త కథ ఇది.
 
  ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్, ఆనంద్‌‌ర పసాద్, అన్నే రవిలను ఎప్పటికీ మర్చిపోను ’’ అని అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘రవికుమార్ చౌదరి తీసిన  ‘పిల్లా నువ్వు లేని జీవితం’  సినిమా చూసి థ్రిల్ అయ్యా. గోపీచంద్‌తో సినిమా చేసేవాళ్లందరూ ఆయనతో లవ్‌లో పడతారు’’ అన్నారు.  గోపీమోహన్ మాట్లాడుతూ- ‘‘ ‘లౌక్యం’లో కామెడీ పాళ్లు ఎక్కువ. కానీ ఇందులో కామెడీ, యాక్షన్‌తో పాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయి’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, రచన: ఘటికాచలం, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement