AS Ravi Kumar Choudhary
-
గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్
మ్యాచో స్టార్ గోపీచంద్‌తో యజ్ఞం,సౌఖ్యం.. వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాను తీసి ఇండస్ట్రీలో కంటికి కనిపించకుండా పోయాడు. రాజ్‌తరుణ్‌తో ‘తిరగబడరాసామీ’ సినిమా పుణ్యమా అని మళ్లీ తెరపైకి వచ్చి ఆ సినిమాలో నటించిన మన్నారా చోప్రాను ముద్దు పెట్టడం వంటి చేష్టలతో వైరల్ అయ్యాడు. ఆ వెంటనే గోపీచంద్‌పై పలు అసభ్య పదాలతో వ్యక్తిగతంగా దూషించాడు. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) 'ఒరేయ్ అంత బలిసిందా రా నీకు'.. అంటూ గోపీ చంద్‌పై విరుచుకుపడటమే కాకుండా ఆ ఇంటర్వ్యూలో మొత్తం ఆయన్ను తిట్టడమే పని పెట్టుకున్నాడు. ఇంకేముంది వెంటనే గోపీచంద్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరిని భారీగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తాగి వచ్చి తమ హీరోపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరైన రీతిలో బుద్ధి చెబుతామని సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ఇలా మాట్లాడే వాడికి ఏ హీరో అయినా సినిమా అవకాశం ఎలా ఇస్తారని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇలా గోపీచంద్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోయడంతో డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి చివరకు దిగొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ గురించి మళ్లీ ఇలా చెప్పుకొచ్చాడు. 'గోపీతో ఎలాంటి గొడవ లేదు. నాకు ఆయన బిడ్డలాంటి వాడు.. తమ్ముడు లాంటి వాడు.. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు.. ఆ వ్యాఖ్యల వల్ల రిగ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. గోపీచంద్ విషయంలో నాదే తప్పు. ఆ మాటలు కూడా గోపీపై ఆవేదనతోనే వచ్చాయి. నా వల్ల హర్ట్ అయిన గోపీచంద్ ఫ్యాన్స్ ఫోన్లు చేస్తున్నారు. ఇంతటితో వదిలేయండి.' అని ఆయన అన్నారు. కానీ ఎ.ఎస్.రవికుమార్ చౌదరిపై గోపీ చంద్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు ఏ మాత్రం తగ్గడం లేదు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే స్థితిలో ఉన్నావని ఒకరంటే... ఆరోజు తాగి మాట్లాడితే.. ఈ రోజు తాగకుండా మాట్లాడుతున్నాడని మరోకరు తెలిపారు. ఈ వివాదంపై గోపీచంద్ మాత్రం స్పందించ లేదు. -
డైరెక్టర్ ముద్దుపై తొలిసారి రియాక్ట్ అయిన మన్నారా చోప్రా
హీరోయిన్ మన్నారా చోప్రాకు టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ మీడియా సమావేశంలో ముద్దు పెట్టడం.. ఆ వీడియో వైరల్ కావడంతో పాటు ఆయన భారీగా ట్రోలింగ్‌కు కూడా గురైయారు. ఇదే విషయంపై ఆయన ఇప్పటికే స్పందించారు. 'హీరోయిన్ మన్నారా చోప్రాకు, నాకు లేని నొప్పి మీకెందుకు' అంటూ మరోసారి చిల్లర కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.. (ఇదీ చదవండి: వెబ్‌సైట్స్ నుంచి సలార్ తొలగింపు.. డైనోసార్‌పై భారీ ఎఫెక్ట్) తాజాగ ఒక యూట్యూబ్ ఛానల్‌కు హీరోయిన్ మన్నారా చోప్రా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై ఆమె తొలిసారి స్పందించింది. ఆ సందర్భంలో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ తప్పుగా అలా చేసి ఉంటారని తాను అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. మొదటి నుంచి తనను ఆయన బేటీ బేటీ అంటూ పిలిచే వారని చెప్పింది. అంతే కాకుండా ఆమెను సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నోసార్లు ఆయన మెచ్చుకున్నారని తెలిపింది. రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమాలో తన పాత్రే లీడ్ హీరోయిన్లా ఉంటుందని ఆయన కితాబు ఇచ్చినట్లు మన్నారా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆయన ముద్దు పెట్టిన తర్వాత తాను వెళ్లిపోగానే అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదని తెలిపింది. ఈ వీడియోలో తన రియాక్షన్ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుందని చెప్పింది. తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి అంటూ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోలేదని మన్నార చోప్రా వెల్లడించింది. బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్‌తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఏఎస్ రవికుమార్.. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తీశాడు. ఇందులో హీరోయిన్ మన్నారా చోప్రా.. ఓ కీలక పాత్రలో నటించింది. Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 (ఇదీ చదవండి: సమంత - విజయ్‌ల మధ్య లిప్‌లాక్ సీన్స్ అవసరమా..?) -
హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ ‘తిరగబడరాసామీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో హీరోయిన్గా మాల్వీ మల్హోత్రా ఉండగా మున్నారా చోప్రా నెగటివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ కార్యక్రమంలో మున్నారా చోప్రాను డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ముద్దు పెట్టుకోవడంతో చాలరోజుల తర్వాత ఆయన పేరు వైరల్ అయింది. గోపీచంద్‌తో యజ్ఞం,సౌఖ్యం... సాయి ధరమ్‌తేజ్‌తో పిల్లా నువ్వులేని జీవితం.. బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాలకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. సుమారు పదేళ్ల తర్వాత రాజ్‌తరుణ్‌తో ‘తిరగబడరాసామీ’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా హీరో గోపీచంద్‌పై ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు ఇలా చేశాడు. గతంలో అందరం చెట్టు కింద కూర్చోని భోజనం చేసేవాళ్లం.. ఒకరోజు అతని కోసం వెళ్తే కొంతసేపు వెయిట్చేయమను అన్నాడు అని గోపీచంద్ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఇలా విమర్శలు చేశాడు. 'ఒరేయ్ అంత బలిసిందా రా మీకు..? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారుగురిని దాటుకుని రావాల్నా.. వాడిని హీరోగా నేనే చేశాను (యజ్ఞం). అప్పటివరకు వాడు విలన్‌గా నటించేవాడు (జయం,నిజం,వర్షం). నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యునరేషన్ కంటే వాడికి తక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.. వాడు ఇప్పుడు ఎదరుపడినా ఇలానే మాట్లాడుతాను. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు నేడు పూర్తిగా మారిపోయాడు. 2016 సంవత్సరంలో కోఠి ఉమెన్స్ కాలేజీలో 'రారాజు' సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో నేను కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో వీరభద్ర సినిమా తీసి ప్లాప్‌లో ఉన్నాను. ఈ కారణంతో మరో సినిమా తీద్దామని అడిగిన నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఇదంతా జరిగిన సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా అక్కడే ఉన్నారు.' అని ఆయన పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గోపిచంద్ ఫ్యాన్స్ కూడా ఎ.ఎస్.రవికుమార్ చౌదరిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్ మున్నారా చోప్రాను ముద్దు పెట్టుకుని విమర్శలు ఎదుర్కొంటుండగా.. తాజాగ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై గోపీచంద్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు గోపీచంద్‌పై ఎలాంటి రిమార్క్ లేదని... అతనిపై ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి కామెంట్లు కూడా చేయలేదని వారు తెలుపుతున్నారు. వ్యక్తిగతంగా ఏదో కారణం పెట్టుకుని పబ్లిగ్ ప్లాట్‌ఫామ్‌పై ఇలా మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కంటే గొప్పోళ్లా..? ఇండస్ట్రీలో మొఖం మీద మేకప్ వేసుకున్న తర్వాత మేకలాంటి చేష్టలు చాలమందికి ఉన్నాయని ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెలిపాడు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న వారిలో చాలమంది రీల్ హీరోస్ మాత్రమే అని రియల్ కాదన్నాడు. తలపొగరు నెత్తికెక్కి డెమీగాడ్స్లా కొందరు హీరోలు విర్రవీగుతున్నారంటూ.. చిరంజీవి, బాలకృష్ణ కంటే వీళ్లందదు గొప్పోళ్లా..? అంటూ ఫైర్ అయ్యాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా డిసిప్లెన్ కలిగిన వ్యక్తి అంటూ పేర్కొంన్నాడు. -
పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్
సినిమా హీరోయిన్లు బయటకు నవ్వుతూ కనిపించినా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సెట్లో కావొచ్చు.. పబ్లిక్ ప్లేస్‌లో కావొచ్చు అభిమానులం అని చెప్పి, కొందరు వీళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఓ తెలుగు దర్శకుడు పబ్లిక్‌గా హీరోయిన్‌కి ముద్దుపెట్టేశాడు. (ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్) బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్‌తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఏఎస్ రవికుమార్.. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తీశాడు. ఇందులో హీరోయిన్ మన్నారా చోప్రా.. ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా సినిమా ప్రమోషన్స్ నిర్వహించగా, దానికి చిత్రబృందం హాజరయ్యారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫొటోలకు పోజులిస్తుండగా హీరోయిన్ మన్నారా చోప్రా అనుమతి లేకుండా ఆమెకు ముద్దుపెట్టేశాడు. ఆమె నవ్వేసి ఊరుకుంది గానీ వీడియో చూస్తుంటే మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీలైనట్లు అనిపిస్తోంది. దీంతో నెటిజన్స్.. సదరు డైరెక్టర్ తీరుపై విమర్శిస్తున్నారు. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ముద్దుపెట్టేశాడు. (ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై స్పందించిన నాగచైతన్య.. అవన్నీ!) Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 -
సూపర్ ఎనర్జీ!
‘‘ఆత్మీయుల పెదాలపై చిరునవ్వు కోసం ఎంటర్టైన్ చేయడానికైనా, ఎంతటివారికైనా ఎదురెళ్లడానికి రెడీ అనే టైప్ ఈ కుర్రాడు. ఈ యువకుని లక్ష్యం ఏంటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 25 వరకూ ఆగాల్సిందే’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సౌఖ్యం’. ఈ చిత్రం పాటలను వచ్చే నెల 13న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గోపీచంద్, శ్వేతా భరద్వాజ్‌లపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘బౌండ్ స్క్రిప్ట్‌తో షూటింగ్ మొదలుపెట్టి అనుకున్న సమయానికి పూర్తి చేశాం. గోపీచంద్ సొంత ఊరు ఒంగోలులో పాటల వేడుకను ఘనంగా చేయనున్నాం. శ్రీధర్ సీపాన, కోన వెంకట్, గోపీ మోహన్ సహకారంతో పక్కా స్క్రిప్ట్ రెడీ చేయగలిగాం. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ హైలైట్’’ అని చెప్పారు. ‘‘అందరినీ అలరించే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. రెజీనా మంచి కోస్టార్. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని గోపీచంద్ అన్నారు. ‘‘డిసెంబర్ 13 నా పుట్టినరోజు. అదే రోజున పాటలు రిలీజ్ కానుండటం ఆనందంగా ఉంది’’ అని రెజీనా చెప్పారు. ఈ సాంగ్ ఎనర్జిటిక్‌గా ఉంటుందని కొరియోగ్రాఫర్ శంకర్ చెప్పారు. గోపీచంద్‌తో ప్రత్యేక పాట చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందనీ, ఈ పాట సూపర్ ఎనర్జీతో ఉంటుందనీ శ్వేత తెలిపారు -
అంతకు మించిన హీరోయిజమ్ ఉంటుంది: గోపీచంద్
గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, రచయిత శ్రీధర్ సీపాన క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ - ‘‘ ‘లౌక్యం’ తర్వాత శ్రీధర్ చాలా మంచి కథతో వచ్చారు. ‘యజ్ఞం’ తర్వాత పదేళ్లకు మళ్లీ రవికుమార్ చౌదరితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది . కోనవెంకట్, గోపీమోహన్‌ల మీద చాలా నమ్మకం ఉంది. వాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే ఈ సినిమా ఒప్పుకున్నా. ‘లౌక్యం’ సినిమాను మించిన హీరోయిజమ్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘గోపీచంద్‌కు, మా సంస్థకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలో శ్రీధర్ సీపానను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఓ చిత్రం నిర్మించనున్నాం’’ అని తెలిపారు. రవికుమార్ చౌదరి మాట్లాడుతూ- ‘‘శ్రీధర్ సీపాన మంచి స్టోరీ ఇచ్చారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం ’’ అని చెప్పారు. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ- ‘‘రొటీన్‌కి భిన్నంగా గోపీచంద్ శైలిలో సాగే సరికొత్త కథ ఇది. ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్, ఆనంద్ర పసాద్, అన్నే రవిలను ఎప్పటికీ మర్చిపోను ’’ అని అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘రవికుమార్ చౌదరి తీసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా చూసి థ్రిల్ అయ్యా. గోపీచంద్‌తో సినిమా చేసేవాళ్లందరూ ఆయనతో లవ్‌లో పడతారు’’ అన్నారు. గోపీమోహన్ మాట్లాడుతూ- ‘‘ ‘లౌక్యం’లో కామెడీ పాళ్లు ఎక్కువ. కానీ ఇందులో కామెడీ, యాక్షన్‌తో పాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయి’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, రచన: ఘటికాచలం, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై.