గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్‌ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్‌ | As Ravikumar Sorry To Say Gopichand Fans | Sakshi
Sakshi News home page

Gopichand: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్‌ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్‌

Published Sat, Sep 2 2023 2:13 PM | Last Updated on Sat, Sep 2 2023 3:07 PM

As Ravikumar Sorry To Say Gopichand Fans - Sakshi

మ్యాచో స్టార్ గోపీచంద్‌తో యజ్ఞం,సౌఖ్యం.. వంటి సినిమాలను డైరెక్ట్‌ చేసిన ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాను తీసి ఇండస్ట్రీలో కంటికి కనిపించకుండా పోయాడు.  రాజ్‌తరుణ్‌తో  ‘తిరగబడరాసామీ’ సినిమా పుణ్యమా అని మళ్లీ తెరపైకి వచ్చి ఆ సినిమాలో నటించిన మన్నారా చోప్రాను ముద్దు పెట్టడం వంటి చేష్టలతో వైరల్‌ అయ్యాడు. ఆ వెంటనే గోపీచంద్‌పై పలు అసభ్య పదాలతో వ్యక్తిగతంగా దూషించాడు.

(ఇదీ చదవండి: హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్‌)

'ఒరేయ్‌ అంత బలిసిందా రా నీకు'.. అంటూ గోపీ చంద్‌పై విరుచుకుపడటమే కాకుండా ఆ ఇంటర్వ్యూలో మొత్తం ఆయన్ను తిట్టడమే పని పెట్టుకున్నాడు. ఇంకేముంది వెంటనే గోపీచంద్‌ ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరిని భారీగా ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. తాగి వచ్చి తమ హీరోపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరైన రీతిలో బుద్ధి చెబుతామని సోషల్‌ మీడియా ద్వారా వార్నింగ్‌ ఇచ్చారు. ఇలా మాట్లాడే వాడికి ఏ హీరో అయినా సినిమా అవకాశం ఎలా ఇస్తారని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇలా గోపీచంద్‌ ఫ్యాన్స్‌ దుమ్మెత్తిపోయడంతో డైరెక్టర్‌ ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి చివరకు దిగొచ్చాడు.  

తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్‌ గురించి మళ్లీ ఇలా చెప్పుకొచ్చాడు. 'గోపీతో ఎలాంటి గొడవ లేదు. నాకు ఆయన బిడ్డలాంటి వాడు.. తమ్ముడు లాంటి వాడు..  మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు.. ఆ వ్యాఖ్యల వల్ల రిగ్రేట్‌గా ఫీల్‌ అవుతున్నాను. గోపీచంద్‌ విషయంలో నాదే తప్పు. ఆ మాటలు కూడా గోపీపై ఆవేదనతోనే వచ్చాయి. నా వల్ల హర్ట్‌ అయిన గోపీచంద్‌ ఫ్యాన్స్‌  ఫోన్లు చేస్తున్నారు. ఇంతటితో వదిలేయండి.' అని ఆయన అన్నారు.

కానీ ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరిపై గోపీ చంద్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న కామెంట్లు ఏ మాత్రం తగ్గడం లేదు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే స్థితిలో ఉన్నావని ఒకరంటే... ఆరోజు తాగి మాట్లాడితే.. ఈ రోజు తాగకుండా మాట్లాడుతున్నాడని మరోకరు తెలిపారు. ఈ వివాదంపై గోపీచంద్‌ మాత్రం స్పందించ లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement