సూపర్ ఎనర్జీ! | Swetha Bhardwaj to dance with Gopichand | Sakshi
Sakshi News home page

సూపర్ ఎనర్జీ!

Published Wed, Nov 25 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

సూపర్ ఎనర్జీ!

సూపర్ ఎనర్జీ!

 ‘‘ఆత్మీయుల పెదాలపై  చిరునవ్వు కోసం ఎంటర్‌టైన్ చేయడానికైనా, ఎంతటివారికైనా ఎదురెళ్లడానికి రెడీ అనే టైప్ ఈ కుర్రాడు. ఈ యువకుని లక్ష్యం ఏంటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 25 వరకూ ఆగాల్సిందే’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సౌఖ్యం’. ఈ చిత్రం పాటలను వచ్చే నెల 13న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గోపీచంద్, శ్వేతా భరద్వాజ్‌లపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు.
 
 ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘బౌండ్ స్క్రిప్ట్‌తో షూటింగ్ మొదలుపెట్టి అనుకున్న సమయానికి పూర్తి చేశాం. గోపీచంద్ సొంత ఊరు ఒంగోలులో పాటల వేడుకను  ఘనంగా చేయనున్నాం. శ్రీధర్ సీపాన, కోన వెంకట్, గోపీ మోహన్ సహకారంతో పక్కా స్క్రిప్ట్ రెడీ చేయగలిగాం. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ హైలైట్’’ అని చెప్పారు.
 
  ‘‘అందరినీ అలరించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. రెజీనా మంచి కోస్టార్. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని గోపీచంద్ అన్నారు. ‘‘డిసెంబర్ 13 నా పుట్టినరోజు. అదే రోజున పాటలు రిలీజ్ కానుండటం ఆనందంగా ఉంది’’ అని రెజీనా చెప్పారు. ఈ సాంగ్ ఎనర్జిటిక్‌గా ఉంటుందని కొరియోగ్రాఫర్ శంకర్ చెప్పారు. గోపీచంద్‌తో ప్రత్యేక పాట చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందనీ, ఈ పాట సూపర్ ఎనర్జీతో ఉంటుందనీ శ్వేత తెలిపారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement