
ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమాల సక్సెస్ తో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన నాగశౌర్య తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. ఛలో సక్సెస్ తరువాత వరుస అవకాశాలతో బిజీ అయినట్టుగా కనిపించినా ఇప్పుడు ఒక్కో సినిమా చేజారుతోంది.
ఇప్పటికే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. తాజాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో ఆనంద్ ప్రసాద్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రారంభమైన సినిమా కూడా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న లేడి ఓరియంటెడ్ సినిమాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బేబిలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో.
Comments
Please login to add a commentAdd a comment