
తెలుగు తెరపై మోహన్‌లాల్, గౌతమి!
మోహన్‌లాల్ తెలుగులో నేరుగా నటించింది ఒక్క చిత్రమే అయినా, అనువాద చిత్రాల ద్వారా ఆయన ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘గాండీవం’ చిత్రంలో బాలకృష్ణ, ఏయన్నార్‌లతో ‘గోరువంక వాలగానే గోకులానికి...’ పాటలో కాలు కదిపిన మోహన్‌లాల్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత డెరైక్ట్ తెలుగు చిత్రంలో నటించనున్నారు. ప్రముఖ నటి గౌతమి కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి ‘ఐతే’, ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ చిత్రాల ఫేం చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘నవంబర్ మూడో వారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా నటీనటులు, సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని నిర్మాత సాయి కొర్రపాటి తెలిపారు.