తెలుగు మాట్లాడుతున్నా! | actor mohanlal speaking in telugu | Sakshi
Sakshi News home page

తెలుగు మాట్లాడుతున్నా!

Published Tue, Jun 21 2016 10:58 PM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

తెలుగు మాట్లాడుతున్నా! - Sakshi

తెలుగు మాట్లాడుతున్నా!

‘‘తెలుగు భాష నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది’’ అని మలయాళ నటుడు మోహన్‌లాల్ అన్నారు. ఈ మలయాళ సూపర్ స్టార్ ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ‘మనమంతా’ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతున్నారు.

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ చిత్రం నిర్మించారు. ఇందులో మోహన్‌లాల్ సరసన గౌతమి నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement