Actor Nithiin "Check" Movie Release Date Announced | నితిన్‌ ‘చెక్‌’ విడుదల తేదీ ఖరారు - Sakshi
Sakshi News home page

నితిన్‌ ‘చెక్‌’ విడుదల తేదీ ఖరారు

Published Fri, Jan 22 2021 6:35 PM | Last Updated on Fri, Jan 22 2021 7:24 PM

Nithiin Check Movie Release Date Out - Sakshi

యంగ్‌ హీరో నితిన్‌... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్‌ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘రంగ్‌ దే’, ‘చెక్‌’, అంధాధున్‌ రీమెక్‌లో నటిస్తున్నారు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ విడుదలవుతుందని ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. రంగ్‌ దే( మార్చి 26న విడుదల) కంటే ముందే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్‌’ సినిమా విడుదల కానుంది.

 ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 19న ‘చెక్’ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement