
‘మహానుభావుడు’ థియేట్రికల్ ట్రైలర్..
హైదరాబాద్: శతమానం భవతి విజయంతో హ్యాపీగా ఉన్న యంగ్ హీరో శర్వానంద్ మరో హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం రిలీజ్ అయిన శర్వానంద్ అప్‌కమింగ్ మూవీ మహానుభావుడు అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ఇదే అంచనాలను అభిమానులు వ్యక్తం చేశారు. దసరా బరిలో గట్టి పోటీ ఇస్తుందని, తమన్ సంగీతం కూడా ఈ సినిమాకు మంచి ఎసెట్ కానుందని భావిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బేనర్ పై రూపుదిద్దుకున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ మహానుభావుడు. శర్వానంద్, మెహరీన్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, జబర్దస్త్ వేణు, నాజర్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఓసీడీ అనే డిజార్డర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారు దర్శకుడు మారుతి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.