జూన్‌ 25న ‘గోల్డ్’ ట్రైలర్‌ | Akshay Kumar Gold Trailer To Be Out On 25th June | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 19 2018 3:47 PM | Last Updated on Tue, Jun 19 2018 3:47 PM

Akshay Kumar Gold Trailer To Be Out On 25th June - Sakshi

బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘గోల్డ్’‌. 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్‌ మెడల్‌ అందించిన కోచ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన గోల్డ్‌ టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా టీజర్‌లోని డైలాగ్స్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి.

రీమా కగ్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మౌనీ రాయ్‌, కునాల్‌ కపూర్‌, అమిత్‌ సద్‌, వినీత్‌ కుమార్‌సింగ్‌లు ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్‌ కానున్న ఈసినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈ నె 25న రిలీజ్ చేయనున్నారు. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ ట్రైలర్‌ మరింత ఆసక్తికరంగా ఉంటుందని హామీ ఇస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement