అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నీతో'. ఈ సినిమాకు బాలు శర్మ దర్శకత్వం వహించగా.. పృథ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇటీవల సక్సెస్ అయిన సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి చేతులమీదుగా విడుదల చేశారు.
ఈ ట్రైలర్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. 'మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ.. ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తు రాదు" లాంటి డైలాగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించింది చిత్ర బృందం. ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చగా.. సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 30వ థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment