ఖైదీ ట్రైలర్ వచ్చేసింది... | khaidi no 150 theatrical trailer released | Sakshi
Sakshi News home page

ఖైదీ ట్రైలర్ వచ్చేసింది...

Published Sat, Jan 7 2017 6:47 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

khaidi no 150 theatrical trailer released

ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ చానల్లో పెట్టారు. చిరంజీవి మార్కు డైలాగులు, డాన్సులు, ఫైట్లన్నింటినీ ఈ 1.46 నిమిషాల థియేట్రికల్ ట్రైలర్‌లో పొందుపరిచారు. 'కష్టం వస్తుందో.. కార్పొరేట్ సిస్టం వస్తుందో రమ్మను', 'పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లో ఉంటది.. వెయిటింగ్' లాంటి డైలాగులను తనదైన శైలిలో చిరంజీవి చెప్పడం చూసి అభిమానులు ముచ్చట పడుతున్నారు. 
 
చిరు డైలాగులు, డాన్సులతో పాటు రత్నవేల్ ఫొటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో కనిపిస్తోంది. ముందుగా చిరంజీవిని వెనకనుంచి, తర్వాత సైడ్ నుంచి చూపించి.. ఆ వెంటనే డాన్సులు, ఫారిన్ లొకేషన్లు చూపించారు. అర నిమిషం దాటిన తర్వాత ఫైటింగులు మొదలవుతాయి. విలన్‌గా నటించిన తరుణ్ అరోరాను కూడా హీరోపాత్రకు దీటుగానే చూపించినట్లు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement