khaidi no 150
-
చిరుపై అభిమానం తగ్గలేదు : అల్లు అరవింద్
‘‘చిరంజీవిగారి రీఎంట్రీని ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. అప్పటికీ.. ఇప్పటికీ ఆయనపై ప్రజల అభిమానం ఏమాత్రం తగ్గలేదనడానికి వసూళ్లే నిదర్శనం. ‘ఖైదీ నంబర్ 150’ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొణిదెల సురేఖ సమర్పణలో వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘చిరు రీ–ఎంట్రీ కోసం ఏ దర్శకుడైతే బాగుంటాడని మేం వేటాడి, వెంటాడ లేదు. వినాయక్ ది బెస్ట్ అని ఫిక్స్ అయ్యాం. అనుకున్నట్లే ఆయన చిరంజీవిని చక్కగా చూపించారు. తక్కువ టైమ్‌లో వంద కోట్ల గ్రాస్‌లో చేరిన చిత్రం మాదే అని చెప్పడానికి సంతోషంగా ఉంది. మా చిత్రం విడుదలైన వారానికే ప్రపంచవ్యాప్తంగా 108.48కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 76.43 కోట్లు వసూలు కావడం విశేషం. నాలుగైదు రోజుల్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించనున్నాం’’ అని చెప్పారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి కథ 49 శాతమైతే, చిరంజీవి గారి గ్లామర్ 51 శాతం. తన మేనల్లుడు నిర్మాత కావడంతో అల్లు అరవింద్‌గారు వెనకుండి మా టీమ్‌ను ముందుకు నడిపించారు. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ఎంత సంతోషాన్నిచ్చిందంటే చాగల్లులోని మా ఇంట్లో నిజమైన సంక్రాంతి జరుపుకున్నాం. ఇప్పటి వరకూ చాగల్లులో ఐదులక్షలకు మించి ఏ చిత్రం వసూళ్లు చేయలేదు. మా చిత్రం ఇప్పటికే ఏడులక్షలు వసూలు చేసింది. సమస్యలపై ఈ చిత్రంలో మాతృకకు మించి లోతుగా చర్చించాం. అన్నయ్య నుంచి ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తారు. దానికి ప్రాధాన్యం ఇచ్చాం. నాకు ఇంతమంచి కథ ఇచ్చిన మురుగదాస్‌గారికి కృతజ్ఞతలు. మహిళా ప్రేక్షకులు కూడా మా సినిమాకు బ్రహ్మర థం పడుతున్నారు. చిరుపై తమకున్న అభిమానాన్ని ప్రేక్షకులు కలెక్షన్ల రూపంలో వర్షంలా కురిపిస్తున్నారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో చిరంజీవిగారు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. తర్వాతి చిత్రంలో ఇంతకంటే హ్యాండ్సమ్గా కనిపించేందుకు కష్టపడుతున్నారు. ఈ చిత్రం కోసం ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావుగారు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కెమెరామేన్ రత్నవేలుతో పాటు టెక్నీషియన్స్ అంతా బాగా కష్టపడ్డారు. వారందరికీ, మా చిత్రాన్ని ఆదరించిన తెలుగువారికీ కృతజ్ఞతలు’’ అని చెప్పారు. -
రియాలిటీ చెక్
-
ఖైదీనంబర్ 150కి మాటలు రాయడం నా అదృష్టం
మాటల రచయిత, డైరక్టర్ తిరుమల వేమారెడ్డి ఎమ్మిగనూరురూరల్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్ 150కు మాటలు, డైలాగ్్స రాసే అవకాశం లభించడం తన అదృష్టమని రైటర్ తిరుమల వేమారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆయన బంధువుల గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేమారెడ్డి మాట్లాడారు. తనది మంత్రాలయం మండలం కల్లుదేకుంట గ్రామమని చెప్పారు. తండ్రి తిమ్మారెడ్డి, తల్లి సరోజమ్మల ప్రోత్సాహంతోనే తాను సినీఫీల్డ్‌లో రచయితగా, డైరెక్టర్‌గా రాణిస్తున్నట్లు వెల్లడించారు. మొదట్లో రచయిత పోసాని మురళీకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత స్నేహితులు, శివయ్య, మనసిచ్చిచూడు, హనుమాన్ జంక్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, రచ్చ, ధ్రువ తదితర సినిమాలకు రైటర్‌గా పనిచేశానన్నారు. వీవీ వినాయక్ తీసిని ‘దిల్’ సినిమాకు మాటలు రాయడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందనా్నరు. దర్శకుడిగా ‘చెక్కిలిగింత’ సినిమా తీసినట్లు చెప్పారు. తండ్రి తెచ్చి ఇచ్చిన నవలలు, పుస్తకాలు తన ఎదుగుదలకు దోహదపడ్డాయన్నారు. -
‘ఖైదీ నంబర్ 150’ టిక్కెట్ దొరకలేదని...
విశాఖలో గొంతుకోసుకున్న యువకుడు చికిత్స పొంది సాయంత్రం సినిమా చూసిన వైనం గుంటూరు జిల్లాలో బెనిఫిట్ షో ఆలస్యం కావడంతో థియేటర్ ధ్వంసం హద్దులు దాటిన అభిమానం సాక్షి, విశాఖపట్నం/కొల్లూరు(వేమూరు): అభిమాన కథానాయకుడు నటించిన చిత్రాన్ని తొలిరోజే చూడాలన్న ఆరాటంతో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సినిమా టిక్కెట్ దొరక లేదన్న అసహనంతో గొంతు కోసుకున్నాడు. మరో ఘటనలో.. చెప్పిన సమయానికి సినిమాను ప్రదర్శించలేదని ఆగ్రహించిన అభిమానులు థియేటర్‌పై దాడి చేశారు. దీంతో థియేటర్ స్క్రీన్ చిరిగిపోయింది. కుర్చీలు ముక్కలయ్యాయి. తలుపులు పగిలిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం బుధవారం విడుదలైంది. విశాఖపట్నంలో తొలిరోజే సినిమాను చూడాలన్న ఆశతో యువకుడు నాగరాజు స్థానిక రామా టాకీస్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే టిక్కెట్లు అయిపోయాయని థియేటర్ నిర్వాహకులు చెప్పారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా టిక్కెట్ దొరక్కపోవడంతో అసహనానికి గురైన నాగరాజు బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో చికిత్స అనంతరం మళ్లీ థియేటర్ వద్దకు వచ్చి టిక్కెట్ తీసుకుని సినిమా చూసి వెళ్లాడు. థియేటర్ స్క్రీన్, కుర్చీలు ధ్వంసం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో స్థానిక శ్రీనివాస టాకీస్ నిర్వాహకులు ‘ఖైదీ నంబరు 150’ బెనిఫిట్ షో ప్రదర్శిస్తామంటూ ముందుగానే టిక్కెట్లు విక్రయించారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటలకే ప్రదర్శన ఉంటుందని చెప్పారు. టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీరా లోపలికి వెళ్లగా, ఖైదీ నంబరు 150కి బదులు వేరే డబ్బింగ్ చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. అభిమానులు ఆందోళనకు దిగడంతో నిర్వాహకులు ఆ సినిమా ప్రదర్శన నిలిపివేశారు. చిరంజీవి చిత్ర ప్రదర్శనకు సంబంధించిన డిజిటల్ లాక్ చేరడం ఆలస్యమైందంటూ కాలం గడిపారు. తెల్లవారుజామున నాలుగున్నర వరకూ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూశారు. ఈలోగా ఇతర ప్రాంతాల్లో చిత్ర ప్రదర్శన ప్రారంభమైందంటూ సమాచారం అందడంతో సహనం కోల్పోయారు. కుర్చీలు, థియేటర్ తలుపులు, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా థియేటర్లోనే టపాసులు పేల్చుతూ, కుర్చీలను స్క్రీన్ పైకి విసురుతూ పూర్తిగా చించివేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, అభిమానులను చెదరగొట్టారు. ఈ ఘటనలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు థియేటర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సందడి!
-
తొలిరోజు 'ఖైదీ' కలెక్షన్ల సునామీ!
'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత నటించిన సినిమా 'ఖైదీ నంబర్ 150'. ఈ సినిమా ఊహించినట్టుగానే భారీ కలెక్షన్లను రాబడుతున్నది. మొదటిరోజు భారీ వసూళ్లతో రికార్డులు సృష్టిస్తున్నది. దేశవ్యాప్తంగా బుధవారం విడుదలైన ఈ సినిమాకు అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ఇక అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల తుఫాన్ సృష్టించిందని ప్రముఖ బాలీవుడ్ ట్రెడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. అమెరికాలో మంగళవారమే విడుదలైన ఈ సినిమా 12 లక్షల 51 వేల 548 డాలర్లు (రూ. 8.56 కోట్లు) వసూలు చేసిందని ఆయన వెల్లడించారు. మిడ్వీక్లో విడుదలైనప్పటికీ ఈ సినిమా అమెరికాలో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మరోవైపు దాదాపు పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా అక్కినేని నాగార్జున, మోహన్‌బాబు, అక్కినేని అఖిల్ చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరంజీవి సినిమా ఘనవిజయం సాధించాలని నాగార్జున ఆకాంక్షించారు. -
సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సందడి!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150' విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్లో హీరో అల్లు అర్జున్ హల్చల్ చేశారు. భార్య స్నేహారెడ్డితోపాటు చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఆయన సినిమా వీక్షించారు. చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, ఇతర కుటుంబ సభ్యులు థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ బన్నీ థియేటర్లో గుమిగూడిన మెగా అభిమానులకు అభివాదం చేసి.. అలరించారు. బన్నీ రాకతో థియేటర్ వద్ద కోలాహలం నెలకొని.. స్వల్ప తోపులాట జరిగింది. థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అల్లు అర్జున్ చెప్పాడు. పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు కూడా తొలిరోజే సినిమాను వీక్షించారు. తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులను అలరించేరీతిలో ఉందనే టాక్ వినిపిస్తోంది. తమిళంలో మురగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన 'కత్తి' సినిమాకు రీమేక్‌గా 'ఖైదీ నంబర్ 150' వచ్చిన సంగతి తెలిసిందే. -
'మా అబ్బాయి సినిమా సూపర్బ్‌గా ఉంది'
హైదరాబాద్: తన తనయుడు, మెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'ఖైదీ నంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇవ్వడంపై తల్లి అంజనాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తన కొడుకు సినిమా సూపర్బ్‌గా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లలో ఆమె స్వయంగా సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమా అద్భుతంగా ఉంది. 60 ఏళ్ల వయసులోనూ డ్యాన్స్, నటనతో చిరంజీవి అదరగొట్టాడు. అందరికీ నిజమైన సంక్రాంతి పండుగను అందించాడు' అని అన్నారు. చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ రూపొందిన 'ఖైదీ నంబర్ 150' సినిమా మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం.. మంచి టాక్ వస్తుండటంతో మెగాఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మెగా రీ ఎంట్రీపై దర్శకుల స్పందన
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఖైదీ నంబర్ 150 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ హడావిడి చేసేస్తున్నారు. ఈ ఉత్సాహం ప్రేక్షకుల్లోనే కాదు సినీ ప్రముఖుల్లోనూ కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందే నాగార్జున, మోహన్ బాబు, రాధిక లాంటి సీనియర్ నటులు మెగాస్టార్ రీ ఎంట్రీ సందర్భంగా శుబాకాంక్షలు తెలియజేయగా రిలీజ్ తరువాత దర్శకులు తమదైన స్లైల్లో స్పందిస్తున్నారు. తనకు బాగా నచ్చిన సినిమాలపై ట్వీట్ రివ్యూలనందించే రాజమౌళి మెగా రీ ఎంట్రీని ఆకాశానికి ఎత్తేశాడు. 'బాస్ ఈజ్ బ్యాక్, చిరంజీవి గారు తిరిగి ఇండస్ట్రీకి వచ్చినందకు థ్యాంక్స్. పదేళ్ల పాటు మిమ్మల్ని మిస్ అయ్యాం. తొలి చిత్రంతోనే నిర్మాతగా రికార్డ్‌లు సృష్టిస్తున్నందుకు చరణ్‌కు శుభాకాంక్షలు. వినయ్ గారు కుమ్మేశారంతే. ఈ ప్రాజెక్ట్‌ను మీకన్నా బాగా ఇంకేవరూ తీయలేరు.' అంటూ ట్వీట్ చేశాడు. మెగా అభిమాని హరీష్ శంకర్ అయితే ఏకంగా తన ప్రొఫైల్ పిక్‌గా చిరు ఫోటో పెట్టేశాడు. ' బాక్సాఫీస్‌లు బద్దలు, అన్ని ఏరియాలు రఫ్ ఆడిస్తున్న మెగాస్టార్.. బాస్ తిరిగి రావటమే కాదు.. మరిన్ని సంవత్సరాల పాటు మనల్ని అలరిస్తారు.' అంటూ ట్వీట్ చేశాడు. మరో మెగా అభిమాని, దర్శకుడు మారుతి కూడా భారీగా స్పందించాడు.' మెగాస్టార్ ఎరాలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఖైదీ నంబర్ 150తో బాస్ మాత్రమేకాదు తెలుగు సినిమాకు మంచి రోజులు కూడా వెనక్కి వచ్చాయి' అంటూ ట్వీట్ చేశాడు మారుతి. Boss is Back!!! Chiranjeevi garu thanks for coming back..missed you for 10 years...Congratulations Charan on a record breaking debut as a — rajamouli ss (@ssrajamouli) 11 January 2017 Producer..Vinay garu..kummesaaranthe..None could have handled this project better than you. Team KN150...Have a blast...👍👍 — rajamouli ss (@ssrajamouli) 11 January 2017 Box office lu Baddalu ..... All areas Rough aaadistunna Mega Star......Redefining Openings 🙏🙏🙏🙏🙏 — Harish Shankar .S (@harish2you) 11 January 2017 BOSS IS NOT ONLY BACK HE IS HERE TO ROCK MORE YEARS Amazing experience in.... Sandhya70 mm Childhood memories cherished again — Harish Shankar .S (@harish2you) 11 January 2017 Proud to born in the era of #Chiranjeevi garu #Khaidi150 is not just #Bossisback but Golden days of Telugu Cinema are back.Annayya 🙏🙏 love u — Maruthi Dasari (@DirectorMaruthi) 11 January 2017 -
ఆ స్టెప్ ఖైదీ సినిమాకి హైలైట్
-
ఖైదీ ఫంక్షన్లో అభిమానులు వీరంగం
-
రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు
-
బాస్ ఈజ్ బ్యాక్..
-
విమర్శిస్తే మైలేజ్ వస్తుందని..
♦ యండమూరి, ఆర్జీవీపై పరోక్షంగా నాగబాబు ఫైర్ ♦ స్పందించిన యండమూరి.. ఘాటుగా బదులిచ్చిన ఆర్జీవీ సాక్షి, అమరావతి: చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా రచయిత యండమూరి, రామ్‌గోపాల్ వర్మలపై మండిపడ్డారు. నాగబాబు మాట్లాడుతూ ‘‘ప్రతివాడికీ మెగా ఫ్యామిలీ మీద చూపుంటుంది. చిరంజీవిని, ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తే వాళ్లకు మైలేజ్ వస్తుంది. ఓ ప్రముఖుడు, రచనల్లో నిపుణుడు, ఎవర్నో హైలైట్ చేయడానికి చరణ్ విలువని తగ్గించిన మూర్ఖుడు ఒకడు న్నాడు. వాడికి కామన్సెన్స్ లేదు. వ్యక్తిత్వపు వికాసపు కోర్సులు చెబుతుంటాడు. మొదట వాడు వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. ఇతరులను తక్కువ చేసే కుసంస్కారం వాడిది’’ అంటూ యండమూరి వీరేంద్ర నాథ్‌పై విమర్శలు గుప్పించారు. రామ్‌గోపాల్ వర్మపై విమర్శలు చేస్తూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముంబై వెళ్లిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. ఈ కూతలు ఆపేసి దర్శ కత్వం సక్రమంగా చేసుకుని, ఆ బాంబ్ ఏదో అక్కడే ముంబై లో పేల్చుకుంటే... వాడికీ మంచిది, మాకూ మంచిది. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? ఆయన ఎలా చేయాలి? అని మాట్లాడడం. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలతో మాకేం కాదు. ఇలాంటి పక్షి ఎన్ని కూతలు కూసినా.. సూపర్‌హిట్ సినిమాని ఆపలేవు. ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు’’ అంటూ ధ్వజమెత్తారు. మనసులో ఉన్నది దాచుకోలేరు నాగబాబు వ్యాఖ్యలపై యండమూరి స్పందించారు. ‘‘ఇటీవల ఓ టీవీ ఫంక్షన్లో నాగబాబు కలసి.. కథలు ఇవ్వాలన్నాడు. మరి, ఇలా ఎందుకు జరిగింది? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు! అని ఓ కామెంట్ చేశా. ఈ మధ్యన రామ్‌చరణ్ తేజ్, దేవిశ్రీ ప్రసాద్ లను పోలుస్తూ ఓ కామెంట్ చేశా. ఇద్దరి తండ్రులూ నాకు క్లోజ్. ఫాదర్ కాదు ముఖ్యం, ప్రతిభ ఉండాలని చెప్పడం ఎవరినీ తక్కువ చేయడం కాదు’’ అని చెప్పారు. ట్వీటర్లో ఆర్జీవీ ఫైర్.. నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ట్వీటర్లో ఘాటుగా స్పందిం చారు. మొదట వర్మ అఫీషియల్ ట్వీటర్ ఎకౌంట్ నుండి మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతూ తెలుగులో ట్వీట్స్ వచ్చాయి. తర్వాత ‘నా ట్వీటర్ ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు’ అని వర్మ పేర్కొన్నారు. ‘‘నాగబాబు సార్.. మీకు ఇంగ్లిష్ అర్థం కాదు ఎవరితోనైనా చదివించుకోండి. నాకు సలహా ఇచ్చేముందు మీ ‘జబర్దస్త్’ కెరీర్ గురించి ప్రశ్నించు కోండి. ‘ప్రజారాజ్యం’ టైమ్‌లో మీ అన్నయ్యకు తప్పుడు సలహాలిచ్చి ఆయన ఓడిపోయేలా చేశారు. ‘అక్కుపక్షి’ అనే కామెంట్స్ చేసి టైమ్ వృథా చేసుకునే బదులు మీ సోదరు లను బతిమాలుకోండి. లేదంటే రోడ్డున పడే అవకాశం ఉంది’’ అని వర్మ ట్వీట్స్ చేశారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక వేడుకలకు నాగబాబును తీసుకువెళ్లవద్దంటూ చిరంజీవిని కోరారు. ‘‘ఇప్పుడే ‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ చూశా. ‘అవ తార్’ కంటే కాస్త బాగుంది’’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఖైదీ సభలో పవన్ నిర్మాత స్పీచ్..!
గుంటూరు: హాయ్‌ల్యాండ్‌లో జరిగిన చిరంజీవి 150 సినిమా 'ఖైదీనంబర్ 150' ప్రిరిలీజ్ వేడుకకు ఊహించినట్టే.. ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. అంతకుముందు ఈ సినిమా గురించి స్పందించిన ట్విట్టర్లో పవన్ కల్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు' ఆయన అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు ఆయన తప్పకుండా ఈ వేడుకలో హాజరవుతారని మెగా ఫ్యాన్స్‌లో ప్రచారం జరిగింది. పవన్ రాకపోయినా ఆయన తరఫున ’కాటమరాయుడు’ నిర్మాత శరత్ మరార్ ఈ వేడుక వచ్చారు. పవన్ కల్యాణ్ తరఫున చిరంజీవికి, ఖైదీ నెంబర్ 150 చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు పంపించారు. ఈ సినిమా ఘనవిజయం కావాలని పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శరత్ మరార్ పవన్ కల్యాణ్ పేరు ఎత్తగానే ఈ సభాప్రాంగణం మెగాఫ్యాన్స్ కెరింతలతో మార్మోగింది. మరోవైపు ఈ వేడుకకు రాకపోవడంతో ఆయన ఎందుకు రాలేదు అనే కోణంలో అభిమానుల్లో చర్చ నడిచింది. -
ఖైదీ నెంబర్ 150 ఫంక్షన్లో స్వల్ప అపశృతి
గుంటూరు: చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి అభిమానులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో చెంచయ్య అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వేదిక గుంటూరులోని హాయ్‌లాండ్ వెలుపల బౌన్సర్లకు, అభిమానులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బౌన్సర్లకు గాయాలు కాగా, ఓ అభిమానికి ఇనుపచువ్వ గుచ్చుకుంది. గాయపడ్డ అభిమానిని ఆస్పత్రికి తరలించారు. -
రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు
హాయ్‌ల్యాండ్ వేదికగా జరిగిన ఖైదీ నెం. 150 ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మీద కామెంట్లు చేసిన ఇద్దరు ప్రముఖులపై వాళ్ల పేర్లు ప్రశ్నించకుండానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చరణ్ ముఖం మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడంటూ ఒక వ్యక్తి గతంలో కామెంట్ చేశారని ముందుగా అన్నారు. ఆయన తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, గతంలో చిరంజీవి సినిమాలకు కథలు అందించడం, దర్శకత్వం వహించడం కూడా చేశాడని చెప్పారు. వ్యక్తిత్వ వికాస క్లాసులు కూడా చెప్పుకుంటాడని, ఇప్పుడు ఏమీ లేక ఖాళీగా ఉండటం వల్లే ఈ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని చెబుతూ.. అంతా 'వాడు.. వాడు' అని ప్రస్తావించారు. తాను ఎవరి గురించి చెబుతున్నానో వాడొక్కడికీ అర్థమైతే చాలని, ఇక్కడ ఉన్నవాళ్లందరికీ అర్థం కాకపోయినా పర్వాలేదని తెలిపారు. మరోవ్యక్తి ఇక్కడ డైరెక్షన్ చేయడం చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నాడని, ఎవరు పడితే వాళ్లు మెగాస్టార్‌ను ఒక మాట అంటే మైలేజి పెరుగుతుందని అనుకుంటున్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు. -
ట్రైలర్ వార్: ఖైదీ వర్సెస్ శాతకర్ణి..
ఖైదీ నం 150.. చిరంజీవికి 150వ సినిమా. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్లీ ముఖానికి రంగు వేసుకొని తెరపై తన స్టామినా చూపేందుకు సిద్ధమవుతున్న సినిమా. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు మళ్లీ తెరపై దర్శనమివ్వబోతుండటంతో అభిమానులు ఫుల్ పండుగ చేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో వారి సందడి మరింత పెరిగిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల్లో 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్లతో చిరు అభిమానులు హోరెత్తిస్తున్నారు. ట్రైలర్‌ను సూపర్బ్‌గా ఉందని అంటున్నారు. తమిళంలో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'కత్తి' సినిమాకు రీమేక్‌గా 'ఖైదీనంబర్ 150' వస్తున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి అభిమానులు ఊహించినట్టుగానే దుమ్మురేపాడు. సినిమాలకు దూరమై చాలారోజులైనా ఆ నటనలో ఆ 'ఈజ్' అలాగే ఉండటం మెగా ఫ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిరు స్టెప్పులు ట్రైలర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. డ్యాన్స్‌లో తన దూకుడు ఏమాత్రం తగ్గలేదని చిరు నిరూపించుకున్నారు. ముఖ్యంగా ట్రైలర్ ముగింపులో 'పొగరు నా ఒంట్లో ఉంటది. హీరోయిజం నా ఇంట్లో ఉంటది.. వెయింటింగ్' అంటూ చిరు చెప్పిన డైలాగ్ అభిమానులకు రొమాలు నిక్కబొడిచేలా చేస్తోంది. ఇక చిరు 'ఖైదీనంబర్ 150'కి పోటీగా వస్తున్న బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి చెప్పాల్సిన పనిలేదు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. బాలకృష్ణ 'శాతకర్ణి' చారిత్రాత్మక కథ.. 'బాహుబలి'రీతిలో భారీ హంగులతో నిర్మితమైన సినిమా. చిరు 'ఖైదీనంబర్ 150' సామాజిక సందేహంతో కూడిన సాంఘిక సినిమా. రెండు సినిమాలు ఎక్కడా రాజీపడకుండా దీటుగా నిర్మితమై.. సంక్రాంతి పండుగకి పందెకోళ్లలాగా బరిలోకి దూకేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే రెండు సినిమాల ట్రైలర్లను పోల్చిచూసి.. వ్యాఖ్యానాలు చేస్తున్నారు నెటిజన్లు. ఇటు బాలయ్య 'శాతకర్ణి', అటు చిరు 'ఖైదీ..' వెటికవే భిన్నంగా ఉండి.. ప్రత్యేకతలు చాటుకుంటుండటంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రంజైన పోటీ తప్పదని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎవరి అభిమానులు వారి హీరోల సినిమాలకు 'వీరతాళ్లు' వేస్తుండగా.. నెటిజన్లు మాత్రం ఈ ఇద్దరి సినిమాల ట్రైలర్లు ఆకట్టుకుంటున్నాయని, అంచనాలు పెంచేశాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి మరోసారి బాలయ్య వర్సెస్ చిరు పోరు హోరాహోరీగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఎవరి అభిమానుల మాట ఎలా ఉన్నా ఇంతకు మీకు ఏ ట్రైలర్ నచ్చిందో.. ఒక మాట చెప్పండి? -
ఖైదీ ట్రైలర్ వచ్చేసింది...
-
ఖైదీ ట్రైలర్ వచ్చేసింది...
ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ చానల్లో పెట్టారు. చిరంజీవి మార్కు డైలాగులు, డాన్సులు, ఫైట్లన్నింటినీ ఈ 1.46 నిమిషాల థియేట్రికల్ ట్రైలర్లో పొందుపరిచారు. 'కష్టం వస్తుందో.. కార్పొరేట్ సిస్టం వస్తుందో రమ్మను', 'పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లో ఉంటది.. వెయిటింగ్' లాంటి డైలాగులను తనదైన శైలిలో చిరంజీవి చెప్పడం చూసి అభిమానులు ముచ్చట పడుతున్నారు. చిరు డైలాగులు, డాన్సులతో పాటు రత్నవేల్ ఫొటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో కనిపిస్తోంది. ముందుగా చిరంజీవిని వెనకనుంచి, తర్వాత సైడ్ నుంచి చూపించి.. ఆ వెంటనే డాన్సులు, ఫారిన్ లొకేషన్లు చూపించారు. అర నిమిషం దాటిన తర్వాత ఫైటింగులు మొదలవుతాయి. విలన్‌గా నటించిన తరుణ్ అరోరాను కూడా హీరోపాత్రకు దీటుగానే చూపించినట్లు కనిపిస్తోంది. -
మెగాస్టార్ రాకతో సందడిగా మారిన ఎయిర్పోర్ట్
-
పవన్ వస్తున్నాడు..!
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు ఫలించినట్టుగానే కనిపిస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక ప్రకటించిన దగ్గర నుంచి అభిమానులను వేదిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికిందన్న ప్రచారం జరుగుతోంది. మెగా హీరోలందరూ ఓకె వేదిక కనిపించటం దాదాపు గా కన్ఫామ్ అయిపోయింది. ఇప్పటివరవకు సందిగ్థంలో ఉన్న పవన్ రాకపై కూడా క్లారిటీ వచ్చిదంటున్నారు ఫ్యాన్స్. తన అన్న సినిమా వేడుకు పిలవకపోయినా వస్తానంటూ పవన్ సన్నిహితులతో చెప్పాడన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. సర్థార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 వేడుకకు పవన్ ప్రత్యేక అతిథిగా వస్తున్నాడు. ఈ రోజు(శనివారం) సాయంత్రం గుంటూరు సమీపంలోని హాయ్ లాండ్ లో నిర్వహించనున్న ఈ వేడుకకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఖైది నెం150మూవీ మేకింగ్ వీడియో
-
కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట
-
కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్150' చిత్రంలోని మరో పాటను యూట్యూబ్ లో బుధవారం విడుదల చేశారు. రైతుల కష్టాల నేపథ్యంలో ఈ పాట వస్తుంది. అన్నదాతల ఆక్రందనలను ఆర్థ్రంగా పలికించిన ఈ పాట అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. ఈ పాటను తమను ఎంతోగానో కదిలించిందని అభిమానులు పేర్కొన్నారు. ‘నీరు.. నీరు.. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరూ గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. శంకర్ మహదేవన్ ఆలపించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇంతకుముందు విడుదల చేసిన పాటలకు కూడా అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 7న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరులోని హాయ్లాండ్లో నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న 'ఖైదీ నెం.150' సినిమాను విడుదల చేయనున్నారు. -
చిరు ఫ్యామిలీలోనూ సెగలు రేపుతున్న ఖైదీ
-
బాక్సాఫీస్ పాలిటిక్స్
-
‘ఖైదీ’ విడుదల తేదీ ప్రకటించిన చరణ్
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ను జనవరి 11న విడుదల చేస్తున్నట్టు హీరో రామ్‌చరణ్ ప్రకటించారు. బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కంటే ఒకరోజు ముందే తమ సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు. దీనికి గల కారణాలను వివరిస్తూ ఫేస్ బుక్ లో వీడియో పెట్టారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా 12న విడుదలవుతోంది, ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మంచి పరిణామం కాదని నాతో నాన్న అన్నారు. అందుకే ఒకరోజు ముందుగానే జనవరి 11న మా సినిమా విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రావడమన్నది సహజమే’ అని రామ్‌చరణ్ పేర్కొన్నారు. ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తారా అని అడగ్గా... పిలవడానికి ఆయనేమీ పిల్లడు కాదని వ్యాఖ్యానించారు. పవన్ కు ఇన్విటేషన్ ఇస్తానని, అది తన బాధ్యత అని అన్నారు. రావడం, రాకపోవడం అన్నది ఆయన ఇష్టమని చెప్పారు. -
'నన్ను చాలా బాగా చూపించారు.. థ్యాంక్స్'
లక్ష్మీరాయ్(రాయ్ లక్ష్మీ).. ఈ మధ్యకాలంలో కాస్తంత సందడి తగ్గినా మరోసారి అనూహ్యంగా మెరుపులా మెరిసింది. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నంబర్150. ఈ చిత్రంలో చిరుతో కలిసి ఆమె రత్తాలు అనే మంచి ఊపున్న ఐటెమ్ మాస్ గీతానికి చిందులేసింది. చిరుతో కలిసి దుమ్మురేపే స్టెప్పులేసింది. ఈ పాట కూడా మొత్తం చిత్ర ఆల్బమ్‌లోనే పెద్ద హిట్‌గా నిలవడంతో ఇప్పుడు ఆమె సంతోషానికి అవధులేకుండా పోయింది. పైగా ఈ పాటలో కూడా రాయ్ చాలా అందంగా చూపించారంట. దీంతో తనను గతంలో ఎప్పుడూ లేనంత అందంగా తెరపై ఆవిష్కరించడంతో ఆమె చిత్ర యూనిట్ మొత్తానికి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా తనను అందంగా తీర్చిదిద్ది చూపించిన సుష్మిత కొణిదెలకు తన ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మురిసిపోయింది ఈ అమ్మడు. Must thank my entire team of #KhaidiNo150 fr making me look so good!Special thanks to @sushkonidela For making #Ratthalu look the best 😘😬💃 pic.twitter.com/LqbUGHc5OQ — RAAI LAXMI (@iamlakshmirai) 1 January 2017 -
నువ్వూ..నేనూ.. అంటోన్న మెగా స్టార్
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' చిత్రంలోని మరో పాటను బుధవారం విడుదల చేశారు. మీ..మీ..మీమీమీ..ఇకపై ఓన్లీ యూ అండ్ మీ..అంటూ సాగే మూడో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాయంకాలానా, సాగర తీరానా. సంధ్యా సూర్యుడిలా..నువ్వూ..నేనూ... వేసవి కాలానా..వెన్నెల సమయానా..తారా చంద్రుడిలా నువ్వూ..నేనూ.. అంటూ సాగే మెలోడీ సాంగ్ మెగా అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు', 'సుందరి' పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్ర పోస్టర్ కూడా బుధవారమే రిలీజైంది. ఇందులో పంచకట్టులో పవన్ అభిమానులకు కనువిందు చేశారు. -
నువ్వూ..నేనూ.. అంటోన్న మెగా స్టార్
-
త్వరలో 'ఖైదీ నంబర్ 150' పుస్తకావిష్కరణ
సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న మెగా మూవీ ఖైదీ నంబర్ 150. మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న.., మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటంతో ఖైదీ నంబర్ 150పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ విషయంలో కూడా చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ విషయంలో అభిమానులను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టీజర్, మేకింగ్ వీడియోలతో ఆకట్టుకున్న ఖైదీ టీం, త్వరలో ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పుస్తకంలో ఖైదీ నంబర్ 150 సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలను ప్రచురించనున్నారు. ఇప్పటికే ప్రింటింగ్ పనులు కూడా మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు మెగా టీం. చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150, తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో డిసెంబర్ 25న మార్కెట్లోకి విడుదలవుతోంది. -
ఏ హీరోతో అంత సరదాగా లేను: కాజల్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అందం నాలుగురెట్లు పెరిగిందంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. ఖైదీ నంబర్ 150 చిత్రంలో చిరంజీవితో జతకట్టిన అమ్మడు మెగా స్టార్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. 'మెగా ఇమేజ్ను కూడా పక్కన పెట్టి సెట్లో అందరితో సరదాగా ఉండే వారు.నేను సెట్లో కంఫర్టబుల్‌గా మూవ్ అయ్యేలా అవకాశం ఇచ్చారు. నేను నటించిన చిత్రాల్లోని ఏ ఇతర హీరోతో కూడా అంత సరదాగా గడపలేదు. సెట్లో ఉన్న వారందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఆయనతో సరదాగా జోకులు కూడా వేశాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి నిజంగా ఓ గొప్ప డ్యాన్సర్' అంటూ కాజల్ తెగ సంబరపడుతోంది. 'డ్యాన్స్ చేసే సమయంలో కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వాటి ద్వారా నా డ్యాన్స్‌లో మార్పు కూడా వచ్చింది. ఆ మార్పును సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూడొచ్చు. ఇంత కాలం చిరు సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. మెగాస్టార్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. అయనతో కలిసి పని చేయడం నాకు ఎంతో ప్రత్యేకం' అంటూ కాజల్ మురిసిపోయింది. సురేఖ సమర్పణలో వీవీ వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. -
దుమ్మురేపుతున్న చిరు టీజర్
హైదరాబాద్: తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా సందడి మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన తన సొంత సినిమాలో సొంత గొంతుతో ప్రేక్షకులను పలకరించారు. విలన్ల దుమ్ముదులిపారు. గట్టి పంచ్ డైలాగ్ పేల్చారు. అదే స్టైల్‌తో, అదే నడకతో మెగాస్టార్ మెరుపు మరింత రెట్టింపయిందనుకునేలా చేశారు. ఆయన నటిస్తున్న ఖైదీ నంబర్ 150 చిత్ర టీజర్ విడుదలైంది. ఫస్ట్‌లుక్‌తోనే అభిమానుల ఆశలు చిగురింపజేసిన ఆయన ఈ టీజర్‌తో చిత్రంపై మరోసారి అంచనాలు అమాంతం పెంచేశారు. తన దూకుడు తగ్గలేదనిపించారు. అదిరిపోయే నేపథ్య సంగీతం, పోరాట దృశ్యంతో ప్రారంభమైన ఈ టీజర్ విలన్‌కు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ద్వారా ముగిసింది. ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా..కాదని బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్ వార్నింగ్’ అని పంచ్ డైలాగ్ కొట్టి ఎంతో స్టైలిష్‌గా కళ్లజోడు పెట్టుకుంటూ చిరంజీవి ముందుకెళుతూ.. దటీజ్ మెగాస్టార్ అనుకునేలా కనిపించారు. ఈ టీజర్ లో ఆయన మాష్టారు సినిమాలో ఉన్నంత ఫ్రెష్ లుక్ తో కనిపించారు. -
కనువిందు... చిరు చిందు
రానున్న సంక్రాంతికి హీరోగా తన రీ-ఎంట్రీ చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించిన చిరంజీవి, అందుకు తగ్గట్టుగానే ‘ఖైదీ నంబర్ 150’ చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే విదేశాల్లో రెండు పాటల చిత్రీకరణ ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు. వెంటనే సిటీలో కీలక సీన్లు తీయడం మొదలు పెట్టారు. టాకీ పార్ట్ షూటింగ్ గురువారంతో పూర్తయింది. ప్రస్తుతం చిరంజీవి, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌పై ఆఖరిగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తయితే చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టే అట. వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. సమర్పణ: శ్రీమతి సురేఖ. -
మెగా అభిమానులకు భారీ షాక్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ధృవ, మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నంబర్ 150 సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమా ఆడియో రిలీజ్ కూడా అయిపోయింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో జనం థియేటర్ల మొహం చూడటమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ధృవ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్ల విషయంలో తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అందుకే సినిమాను వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో చేస్తున్నారట. ధృవ సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేస్తే జనవరిలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ అదే సమయం మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకే సమయంలో రెండు మెగా ఫ్యామిలీ సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదన్న ఆలోచనలో ఉన్నారు యూనిట్. అందుకే ధృవను సంక్రాంతికి రిలీజ్ చేసి, ఖైదీ నంబర్ 150ని సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుదన్న ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాల వాయిదాపై అధికారిక ప్రకటన లేకపోయినా.. పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తోంది. -
మెగాస్టార్ లుక్కు మెగా రెస్పాన్స్
రిలీజ్ అయిన నిమిషాల్లోనే మెగాస్టార్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా హీరోలు తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మార్క్ కామెంట్ తో మెగా అభిమానులను ఖుషీ చేశాడు. 'నేను ఏడేళ్ల క్రితం చూసిన చిరంజీవి కన్నా.. ఈ లుక్ లో చిరు వయసు ఏడేళ్లు తక్కువగా కనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశాడు. వరుణ్ తేజ్, రామ్ చరణ్ లు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులను మరింతగా హుషారెత్తిస్తున్నారు. బాలీవుడ్ ట్రెడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ పేజ్ లో మెగా లుక్ ను పోస్ట్ చేశారు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఖైదీ నంబర్ 150 ప్రస్తుతం సాంగ్స్ షూట్ లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. WTF? Mega star is looking 7 years younger than I last saw him 7 years back pic.twitter.com/DTxNSgx1ZG — Ram Gopal Varma (@RGVzoomin) 29 October 2016 Boss!!! -
మెగా అభిమానులకు దీపావళి కానుక
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దీపావళి కానుక ఇచ్చారు చిరు టీం. చిరంజీవి ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నంబర్ 150 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైటిల్ లోగోతో పాటు చిరు షాడో ఇమేజెస్ తో కొన్ని పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. తాజాగా దీపావళి కానుకగా చిరు లుక్ రివీల్ చేస్తూ మరో రెండు పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తమిళ్ లో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం తరువాత చిరంజీవి ఫుల్ లెంగ్త్ రోల్ లో వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా మెగా టీం కూడా ఇంట్రస్టింగ్ పోస్టర్ లతో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. -
చిరు జోరు మొదలైంది
మెగా అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెగా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరు రీ ఎంట్రీ సినిమా కావటం.., అదే సమయంలో 150వ సినిమా కూడా కావటంతో మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా మేసేజ్ కూడా ఉండేలా తమిళ సూపర్ హిట్ సినిమా కత్తిని ఖైదీ నంబర్ 150 పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇంతటి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా.., షూటింగ్ సమయంలోనే రికార్డ్ల వేట మొదలెట్టింది. చిరు రీ ఎంట్రీ సినిమా కావటంతో ఖైదీ నంబర్ 150 పంపిణీ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటి పడుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే బాహుబలి తరువాత అత్యధిక మొత్తానికి చిరు సినిమా రైట్స్ అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 13.5 కోట్లకు ఖైదీ నంబర్ 150 సినిమా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2017 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
ఖైదీతో ఆటా పాటా?
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ ఐటెమ్ సాంగ్ చేయనున్నారని తాజా సమాచారం. వాస్తవానికి చిరూ సరసన తమన్నా ఐటెమ్ సాంగ్ చేయనున్నారని ఓ వార్త వినిపించింది. ‘తమన్నాతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది’ అంటూ గతంలో చిరు ఓ ఫంక్షన్లో చెప్పారు కూడా. దాంతో అందరూ ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం తమన్నాకే ఉంటుందనుకున్నారు. కానీ, ఎవరి ఊహలకూ అందని విధంగా సీన్లోకి సడెన్‌గా కేథరిన్ పేరు వచ్చింది. త్వరలో చిరు, కేథరిన్ పాల్గొనగా హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో పాటను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
రామ్ చరణ్ మోసం చేశాడు
ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా. చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా మీద ఆసక్తి పెంచేలా రోజుకో అప్ డేట్‌తో ఊరిస్తున్నాడు నిర్మాత, మెగా తనయుడు రామ్ చరణ్. అంతేకాదు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా చిరు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామంటూ ప్రకటించాడు చరణ్. అయితే అన్నయ్య ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన యూనిట్, చిరంజీవిని మాత్రం షాడో షాట్స్‌తో చూపించాడు. ఎక్కడ చిరు ముఖాన్ని స్పష్టంగా చూపించకుండా కేవలం స్టైల్స్‌తో అలరించే ప్రయత్నం చేశాడు. టీజర్ చూడటానికి సూపర్‌గా అనిపిస్తున్నా, చిరు కనపడకపోవటం మాత్రం అభిమానులకు నిరాశకలిగిస్తోంది. టీజర్ తో పాటు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లలో కూడా చిరు ముఖం కనిపించకుండానే డిజైన్ చేశారు. -
రామ్ చరణ్ మోసం చేశాడు
-
అదే రక్తం అదే పౌరుషం...
‘కాశీకి పోయాడు, కాషాయం మనిషైపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరస మార్చుంటాడనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం.’ - ఇంద్రలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా ఆయన మళ్లీ మేకప్ వేసుకున్నారు. ‘ఇప్పుడూ అదే ఎనర్జీతో డైలాగ్స్ చెబుతున్నారు.. అదే రాకింగ్ పర్ఫార్మెన్స్’ అని చిత్రబృందం అంటున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ నగర శివార్లలోని చేవెళ్లలో షూటింగ్ జరుగుతోంది. రైతు సమస్యలపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘మెగాస్టార్ రాక్స్!! వాట్ ఎన్ ఎనర్జీ!!’ అని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేశారు. ఓ వైపు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. మరోవైపు చిరు సరసన నటించబోయే కథానాయికను ఇంకా ఎంపిక చేయలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలువురి అగ్ర కథానాయికల పేర్లు పరిశీలనలోకి వచ్చాయట. కానీ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న కథానాయికను ఎంపిక చేయమని చిరు సలహా ఇచ్చారని సమాచారం. కథానాయిక ఎంపిక విషయాన్ని దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత రామ్‌చరణ్‌లకు వదిలేశారట. సో, తండ్రి పక్కన సూటయ్యే కథానాయిక కోసం చరణ్ అన్వేషిస్తున్నారు. ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం మేరకు కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రానికి ‘ఖైదీ నం. 150’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.